వికారాబాద్ జిల్లా పరిగిలో ఘోర ప్రమాదం.. బైకును ఢికొన్న డీసీఎం.. మహిళ స్పాట్ డెడ్..

వికారాబాద్ జిల్లా పరిగిలో ఘోర ప్రమాదం.. బైకును ఢికొన్న డీసీఎం.. మహిళ స్పాట్ డెడ్..

వికారాబాద్ జిల్లా పరిగిలో ఘోర ప్రమాదం జరిగింది. పెరిగి మున్సిపల్ పరిధిలోని సుల్తాన్ పూర్ గేట్ దగ్గర నేషనల్ హైవేపై వెళ్తున్న బైకును వెనుక నుంచి డీసీఎం ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ( ఆగస్టు 2 ) జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. 

సుల్తాన్ పూర్ గేట్ దగ్గర నేషనల్ హైవేపై దంపతులు వెళ్తున్న బైకును వెనుక నుంచి ఢీకొట్టింది డీసీఎం. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. భర్తకు తీవ్ర గాయాలవడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు వైద్యులు. బాధితులు బొంరాస్ పేట మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన సాయిలు, లక్ష్మి దంపతులుగా గుర్తించారు పోలీసులు. పెరిగి నుండి నాగిరెడ్డిపల్లి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.