కాకా సింగరేణిని బతికించి లక్ష ఉద్యోగాలు కాపాడారు: మంత్రి వివేక్ వెంకటస్వామి

కాకా సింగరేణిని బతికించి లక్ష ఉద్యోగాలు కాపాడారు: మంత్రి వివేక్ వెంకటస్వామి

పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని ఎంబి గార్డెన్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి కి వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించారు. శనివారం జరిగిన ఈ సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. నిరంతరం ప్రజలకు ఎలా సేవ చేయాలనేదే కాక తపన ఉండేదని.. అందుకే నిరుపేద ప్రజల గుండెల్లో గుడిసెల వెంకటస్వామిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. హైదరాబాద్ లో నిరుపేదలకు 70 వేల ఇండ్లు ఇచ్చిన ఘనత కాక వెంకటస్వామిది అని అన్నారు.సింగరేణి సంస్థ BFRI లో కి వెళ్లినప్పుడు 400 కోట్ల రూపాయల ఇప్పించి సింగరేణి సంస్థ కాపాడిన ఘనత కాక ది అని అన్నారు.కాకా సింగరేణి బ్రతికించి లక్ష ఉద్యోగాలు కాపాడారని అన్నారు.

దేశ వ్యాప్తంగా కార్మికులకు పెన్షన్ విధానాన్ని అమలు చేసింది కాక ఘనతే అని.. కార్మికులు,బీద ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి కాక...ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నామని అన్నారు. ఎంతో మంది నిరుపేదలకు కాక పౌండేషన్,విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందించామని.. తెలంగాణ ఉద్యమ సమయంలో నాకు మంత్రి పదవి ఇస్తా అఫర్ చేశారు కానీ..  నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడానని అన్నారు. 300 మంది ఆత్మ బలిదానాలు తో తెలంగాణ ఏర్పడిందని అన్నారు మంత్రి వివేక్.

అమరులకు ఒక్కొకరికి లక్ష రూపాయలు ఇచ్చామని.. పెద్దపల్లిలో తాను ఎంపీ గా ఉన్నపుడు 700 కోట్ల రూపాయలతో త్రాగు నీటి అవసరాలు తీర్చామని.. రోడ్లు,డ్రైనేజ్ లు వేశామని అన్నారు మంత్రి వివేక్. ఎంపీ గా ఉన్నపుడు పెద్దపల్లి అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డానని.. మూతపడ్డ రామగుండం RFCL నీ రీ ఓపెన్ చేయడం కోసం ఎంతో కృషి చేశానని అన్నారు.మోదీ గాలి ఉన్నపుడు కూడా పెద్దపల్లి లో కాంగ్రెస్ గెలిచిందని.. మన పెద్దపల్లి చుట్టు ఉన్న పార్లమెంట్ పరిధిలో బిజెపి గెలిచిందని అన్నారు.

గడ్డం ఫ్యామిలో లో అవినీతి ఉండదని.. ఆ ఆలోచన కూడా రాదని.. సేవ చేయడమే తమ లక్ష్యమని అన్నారు. రేవంత్ రెడ్డి గారు తనపై నమ్మకం ఉంచి మైనింగ్ శాఖ ఇచ్చారని.. తాను వచ్చాక ఇసుక మాఫియా అణిచివేశామని అన్నారు. ఇసుక దందా లు చేస్తే కేసులు పెట్టాలని ఆదేశాలిచ్చానని అన్నారు. ఎంపీ వంశీ  పై కూడా బాధ్యత ఉందని.. దాని కోసం నిరంతరం పనిచేస్తారని అన్నారు. దేశం లోనే అత్యధికంగా ట్రైన్  హాల్టింగ్స్ ఇచ్చిన ఏకైక ఘనత తమకే దక్కుతుందని అన్నారు.