వారసత్వ వినాశనానికి మా ఇంట్లో వాళ్లు చాలు.. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య

వారసత్వ వినాశనానికి మా ఇంట్లో వాళ్లు చాలు.. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య

పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కూతురు రోహిణి ఆచార్య తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. "కష్టపడి సృష్టించిన, స్థాపించిన వారసత్వాన్ని నాశనం చేయడానికి బయటివాళ్లు అక్కర్లేదు. మన ప్రియమైనవారే (లవ్డ్ వన్స్) చాలు. కొత్తగా కుటుంబంలో చేరినవారు(న్యూలీ మేడ్ ఓన్), మన రక్తసంబంధీకులు (అవర్ ఓన్) చాలు. 

మా కుటుంబానికి ఉనికిని,  గుర్తింపును ఇచ్చిన వారి మూలాలను చెరిపేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఇది నన్ను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అజ్ఞానం అనే ముసుగు ఉన్నప్పుడు అహంకారం మన తలకెక్కుతుంది. అప్పుడు చుట్టూ ఉండే వినాశకర శక్తులు యాక్టివేట్ అవుతాయి. మన ఆలోచనలను, నిర్ణయాలను అవి ఆధీనంలోకి తీసుకుని నియంత్రిస్తాయి" అని రోహిణి ఆచార్య ఎవరి పేరును ప్రస్తావించకుండా ట్వీట్ చేశారు.