IND vs NZ: రేపు (జనవరి 11) ఇండియా, న్యూజిలాండ్ తొలి వన్డే.. లైవ్ స్ట్రీమింగ్, స్క్వాడ్, టైమింగ్ వివరాలు!

IND vs NZ: రేపు (జనవరి 11) ఇండియా, న్యూజిలాండ్ తొలి వన్డే.. లైవ్ స్ట్రీమింగ్, స్క్వాడ్, టైమింగ్ వివరాలు!

ఇండియా, న్యూజిలాండ్ తొలి వన్డే ఆడేందుకు సిద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య ఆదివారం (జనవరి 11) తొలి వన్డే జరగనుంది. వడోదర వేదికగా BCA స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తోంది. సొంతగడ్డ కావడం.. సూపర్ ఫామ్ లో ఉండడంతో ఈ మ్యాచ్ లో టీమిండియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. గత నెలలో సౌతాఫ్రికాపై 2-1 తేడాతో సిరీస్ గెలిచిన భారత జట్టు కివీస్ పై కూడా ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం ఎలాగైనా టీమిండియాకు షాక్ ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. 

ప్రాక్టీస్ లో చెమటోడ్చిన రోహిత్, కోహ్లీ, గిల్: 
 
న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేపథ్యంలో.. టీమిండియా శుక్రవారం మూడు గంటల కఠినమైన ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొంది. స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ, రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ మంచి టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించారు. విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడిన కోహ్లీ, రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. పేసర్లు, స్పిన్నర్ల బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బలమైన షాట్లు కొట్టారు. నెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేరియబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దీటుగా ఎదుర్కొన్నారు.

త్రో డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి దాదాపు గంటన్నర ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. అయితే గురువారం విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హజారే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడిన శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రిషబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉన్నారు. ఈ ముగ్గురు సాయంత్రం టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిశారు. కాలి గాయంతో సౌతాఫ్రికాతో సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరమైన కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా నెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాటు రన్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేశాడు. బౌలర్లు తమ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సరిచూసుకోగా, ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందరూ పాల్గొన్నారు.
 
టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్టింగ్ వివరాలు:

మూడు వన్డే మ్యాచ్ లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి. టాస్ 1:00 గంటలకు వేస్తారు. 

లైవ్ టెలికాస్ట్:  స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ మూడు టీ20 మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళం, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడలో ప్రసారం అవుతుంది.

లైవ్ స్ట్రీమింగ్: జియో హాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్ లో లైవ్ చూడొచ్చు

ఇండియా స్క్వాడ్:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్ 

న్యూజిలాండ్ స్క్వాడ్:

మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, డెవాన్ కాన్వే, జాక్ ఫౌల్క్స్, మిచ్ హే (వికెట్ కీపర్), కులే జామిసన్, నిక్ కెల్లీ, జేడెన్ లెన్నాక్స్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ రే, విల్ యంగ్