బహ్రెయిన్‌‌‌‌‌‌‌‌పై ఇరాన్‌‌‌‌‌‌‌‌ మిస్సైల్ దాడి.. ఒకరు మృతి

బహ్రెయిన్‌‌‌‌‌‌‌‌పై ఇరాన్‌‌‌‌‌‌‌‌ మిస్సైల్ దాడి.. ఒకరు మృతి

మనమా (బహ్రెయిన్‌‌‌‌‌‌‌‌): బహ్రెయిన్‌‌‌‌‌‌‌‌, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌‌‌‌‌‌‌‌, ఖతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాలపై మిస్సైల్స్‌‌‌‌‌‌‌‌, డ్రోన్స్‌‌‌‌‌‌‌‌తో ఇరాన్‌‌‌‌‌‌‌‌ దాడులు కొనసాగిస్తోంది. మంగళవారం బహ్రెయిన్‌‌‌‌‌‌‌‌ రాజధాని మనమాలోని ఓ అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై ఇరాన్‌‌‌‌‌‌‌‌ దాడి చేయడంతో 29 ఏండ్ల మహిళ మృతి చెందింది. మరో 8 మంది గాయపడ్డారు. 

అమెరికా సిబ్బంది బస చేస్తున్న హోటల్‌‌‌‌‌‌‌‌పై డ్రోన్‌‌‌‌‌‌‌‌ దాడి, యూఎస్‌‌‌‌‌‌‌‌ నేవీ ఐదవ ఫ్లీట్‌‌‌‌‌‌‌‌ బేస్‌‌‌‌‌‌‌‌ సమీపంలో పేలుళ్లు సంభవించాయని కూడా బహ్రెయిన్‌‌‌‌‌‌‌‌ అధికారులు తెలిపారు. మంగళవారం జరిగిన దాడిలో 17 బాలిస్టిక్‌‌‌‌‌‌‌‌ మిస్సైల్స్‌‌‌‌‌‌‌‌, 7 డ్రోన్లను అడ్డుకున్నామని చెప్పారు. కాగా, ఇప్పటివరకు ఇరాన్‌‌‌‌‌‌‌‌ ప్రయోగించిన 105 మిస్సైల్స్‌‌‌‌‌‌‌‌, 176 డ్రోన్స్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకున్నామని బహ్రెయిన్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ కమాండ్‌‌‌‌‌‌‌‌ తెలిపింది. 

ఆయిల్‌‌‌‌‌‌‌‌ నిల్వలు ఉన్న ఈస్ట్రర్న్‌‌‌‌‌‌‌‌ రిజీయన్‌‌‌‌‌‌‌‌లో రెండు డ్రోన్లు ధ్వంసం చేసినట్లు సౌదీ డిఫెన్స్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ తెలిపింది. కువైట్‌‌‌‌‌‌‌‌లో ఉత్తర, దక్షిణ ప్రాంతాలపై దాడి చేస్తున్న 6 డ్రోన్లను అడ్డుకున్నట్లు నేషనల్‌‌‌‌‌‌‌‌ గార్డ్‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది. ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా ఇరాన్‌‌‌‌‌‌‌‌ మిస్సైల్‌‌‌‌‌‌‌‌ దాడులను ఆ దేశ సెక్యూరిటీ దళాలు అడ్డుకున్నాయి.