ఆర్ఎఫ్‌‌‌‌సీపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ.. కేంద్ర బడ్జెట్‌‌‌‌లో అంతా శూన్యం: ఎంపీ వంశీ

ఆర్ఎఫ్‌‌‌‌సీపై కేంద్రానిది  సవతి తల్లి ప్రేమ.. కేంద్ర బడ్జెట్‌‌‌‌లో అంతా శూన్యం: ఎంపీ వంశీ
  • భారీ ప్రసంగాలు తప్ప.. కేంద్ర బడ్జెట్‌‌‌‌లో అంతా శూన్యం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులుంటే..విశ్వగురు మోదీ ఎటుపోయారు?
  • ఓదెలలో ఆర్వోబీ కోసం తన పోరాటం ఆగదని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు:   తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతున్నదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ (ఆర్ఎఫ్ సీ)ను పూర్తిగా నిర్లక్ష్యంతో నడిపించడమే ఇందుకు నిదర్శం అని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసం ‘కాకా హౌజ్’లో ఎంపీ వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు.  పెద్దపల్లిలో మూతపడ్డ  ఆర్ఎఫ్‌‌‌‌సీని కేంద్ర మాజీ మంత్రి కాకా (వెంకటస్వామి) ఆనాటి ప్రధానితో మాట్లాడి తిరిగి పున: ప్రారంభించేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. అలాగే, పెద్దపల్లి ఎంపీగా వివేక్ వెంకట స్వామి ఆర్ఎఫ్ సీ ప్రొడక్షన్‌‌‌‌లోకి వచ్చేందుకు కష్టపడ్డారని చెప్పారు. తద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించారన్నారు. తెలంగాణతోపాటు దేశానికి కావాల్సిన యూరియాను ఈ ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌సీ సరఫరా చేసిందని తెలిపారు. కానీ బీజేపీ సర్కారు యూరియా మిస్ మ్యానేజ్ చేస్తున్నదని దుయ్యబట్టారు. ఆర్ఎఫ్‌‌‌‌సీని సరైన రీతిలో నడపలేక తెలంగాణ రైతాంగాన్ని సైతం ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.  ఆర్ఎఫ్‌‌‌‌సీ హెడ్ ఆఫీస్‌‌‌‌ను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌‌‌‌కు మార్చాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసి అనేకమార్లు విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఈ ఆఫీస్ మార్పుతో  అధికారుల్లో అలసత్వం తొలగి.. ప్రొడక్షన్ పెరుగుతుందని వివరించామన్నారు.  ‘‘హెడ్ ఆఫీస్‌‌‌‌ను మార్చలేం. బీజేపీ వాళ్లమైన మేం ఢిల్లీ నుంచే పని చేస్తాం’ అని లేఖలో రిప్లై ఇచ్చారని చెప్పారు. పెద్దపల్లి నియోజక వర్గంలోని ఓదెలలో రైల్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ) మంజూరు అయ్యే వరకు తన పోరాటం ఆగదని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.  కొలనూరు, ఓదెలలో ఆర్వోబీల కోసం కేంద్రానికి రిక్వెస్ట్ చేశామన్నారు. ఇందులో ఒక కొలనూరుకు ఆర్వోబీ మంజూరు చేస్తూ రైల్వే శాఖ తనకు లేఖ ద్వారా తెలిపిందన్నారు.  ఆ ప్రాంత ప్రజలకు ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు.  

మోదీ మూగ మనిషిగా మారారు 

 పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తత కొనసాగుతుంటే.. విశ్వగురువుగా చెప్పుకొనే ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ఉన్నారని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నించారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడిని ప్రధాని కలిసిన 24 గంటల్లోపే ఆ దేశం ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించిందని గుర్తు చేశారు. ఈ విషయంలో ప్రధాని కార్యాలయానికి, విదేశాంగ శాఖకు కనీసం సమాచారం లేదన్నారు. ధైర్యం, సాహసం, జ్ఞానం గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే ప్రధాని.. ఇప్పుడు మూగబోయారని ఎద్దేవా చేశారు.  మోదీ పూర్తిగా కాంప్రమైజ్ అయ్యారన్నారు. ట్రంప్ ఆదేశాల అనుసారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నదని విమర్శించారు.  ఇవన్నీ చూస్తుంటే.. భారత పార్లమెంట్ దేశ రాజధాని ఢిల్లీ నుంచి నడుస్తున్నదా? లేక వాషింగ్టన్  డీసీ నుంచి పాలన సాగుతున్నదా? అనే అనుమానం కలుగుతున్నదని అన్నారు. గల్ఫ్‌‌‌‌ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల క్షేమం, వారిని జాగ్రత్తగా స్వదేశానికి చేర్చే విషయంలో ప్రధాని, కేంద్ర విదేశాంగ మంత్రి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్  చేశారు.

తెలంగాణ నుంచి 20 వేల టన్నుల పసుపు ఎగుమతి

తెలంగాణ నుంచి 2024–25లో 35.17 మిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్ల విలువైన 20,587 మెట్రిక్‌‌‌‌ టన్నుల పసుపు విదేశాలకు ఎగుమతి అయినట్టు కేంద్రం వెల్లడిం చింది.  మంగళవారం లోక్‌‌‌‌సభలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి జితిన్‌‌‌‌ ప్రసాద లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ పసుపు బోర్డు, స్పైసెస్‌‌‌‌ బోర్డుల ద్వారా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పసుపు ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.

స్పీకర్ ఓంబిర్లా వెంటనే రాజీనామా చేయాలి

లోక్‌‌‌‌సభ స్పీకర్ ఓం బిర్లా నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం పార్లమెం ట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్పీకర్‌‌‌‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి రావడం దేశ చరిత్రలోనే ఒక విచారకరమైన రోజని ఆయన పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయకపోవడం దురదృష్టకరమని, ఇది రాజ్యాంగ విరుద్ధమ ని విమర్శించారు. డిప్యూటీ స్పీకర్ విషయం లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరును చూస్తుం టే.. వారికి దళితులన్నా, అంబేద్కర్‌‌‌‌ అన్నా, రాజ్యాంగమన్నా గౌరవం లేదని స్పష్టమవు తున్నదని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ అంటే ప్రజల సభ అని, కానీ మోదీ సర్కార్ దానిని బీజేపీ కార్యాల యంలా మార్చేసిం దని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి దేశ ప్రజా స్వామ్యానికే అవమానకరమని ఆయన మండిపడ్డారు.