నీట్ సూపర్ స్పెషాలిటీ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం

నీట్ సూపర్ స్పెషాలిటీ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం
  • నేటి నుంచి 16వ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం

హైదరాబాద్, వెలుగు: నీట్ సూపర్ స్పెషాలిటీ(ఎస్​ఎస్)–2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడత కౌన్సెలింగ్ మార్చి 10 నుంచి 15న మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌‌ లైన్‌‌ లో రిజిస్ట్రేషన్లకు, మధ్యాహ్నం 3 గంటల వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు మార్చి 11 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. మార్చి 17న సీట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించి, 18న ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ ప్రకటిస్తారు. సీట్లు పొందినవారు మార్చి 19 నుంచి 25లోపు సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

కౌన్సెలింగ్ గడువు తక్కువగా ఉన్నందున శని, ఆదివారాలు, ఇతర పబ్లిక్  హాలిడేస్ లో కూడా అన్ని మెడికల్ కాలేజీలు, ఇన్‌‌ స్టిట్యూట్లు పనిచేయాలని కమిటీ స్పష్టం చేసింది. సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 28 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 3న మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌‌ లైన్ రిజిస్ట్రేషన్లకు, 3 గంటల వరకు ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పించారు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 4వ వరకు వెబ్ ఆప్షన్లు,  ఏప్రిల్ 5, 6 తేదీల్లో సీట్ల కేటాయింపు ప్రాసెస్ పూర్తి చేసి, ఏప్రిల్ 7న రెండో విడత ఫలితాలు వెల్లడిస్తారు. ఈ రౌండ్‌‌ లో సీట్లు సాధించినవారు ఏప్రిల్ 8 నుంచి 16లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నీట్ సూపర్ స్పెషాలిటీ అకడమిక్ సెషన్ ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కానుంది.