తిరుపతిలో దొంగల బెడద.. దైవ దర్శనం కోసం వచ్చే సంపన్న కుటుంబాలే టార్గెట్.. మొన్న రూ.20 లక్షలు.. నిన్న 1000 డాటర్లు..

తిరుపతిలో దొంగల బెడద..  దైవ దర్శనం కోసం వచ్చే సంపన్న కుటుంబాలే టార్గెట్.. మొన్న రూ.20 లక్షలు.. నిన్న 1000 డాటర్లు..

తిరుపతిలో దొంగల బెడద ఎక్కువైపోయింది. దైవ దర్శనం కోసం వచ్చే సంపన్న కుటుంబాలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు దుండగులు. ఈ మధ్య లగ్జరీ హోటళ్లలో వరుస చోరీలు జరుగుతుండటం మరింత ఆందోళన పెంచుతోంది. మొన్న ఇరవై లక్షలు.. లేటెస్టుగా వెయ్యి అమెరికన్ డాలర్లు మాయం కావడం.. అది కూడా ఒకే హోటల్ లో రెండు ఘటనలు జరగటం పలు అనుమానాలకు తావిస్తోంది. 

మారస సరోవరం హోటల్, రూమ్ నెంబర్ 1017లో ఘటన వరుస దొంగతనాలు జరిగాయి. సింగపూర్ నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎన్నారై ఆర్ముగం కుటుంబాన్ని టార్గెట్ చేశారు దొంగలు. శుక్రవారం (జూన్ 19) ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి సాయంత్రం  హోటల్ కు తిరిగి వచ్చిచూసుకోగా లాకర్స్ లో ఉంచిన 1000 డాలర్స్  మాయం అయ్యాయి.

►ALSO READ | తిరుమలలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. అధిక చార్జీలు వసూల్ చేస్తోన్న 25 వాహనాలు సీజ్

దీంతో బాధితుడు ఆర్ముగం అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. క్రైమ్ నెంబర్ 191/2026 కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. ఇదే హోటల్ లో వారం రోజులు క్రితం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారికి చెందిన రూ.20 లక్షలు చోరీకి గురైన విషయం తెలిసిందే. వరుస ఘటనలు ఇంటి దొంగల పనే అయ్యుంటుందని అనుమానిస్తున్నారు.