Ranga Reddy Risers vs Nalgonda Knights: టీజీ20 లీగ్ (TG20 League 2026) లో రంగారెడ్డి రైజర్స్ జట్టు అద్భుతమైన గెలుపుని నమోదు చేసింది. నల్గొండ నైట్స్‌తో జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో రంగారెడ్డి 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నల్గొండ నిర్దేశించిన 190 రన్స్ లక్ష్యాన్ని రైజర్స్ బ్యాటర్లు ఊచకోత కోస్తూ కేవలం 16.3 ఓవర్లలోనే ఛేజ్ చేసేశారు. రంగారెడ్డి జట్టు కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ ఫ్రంట్ నుంచి లీడ్ చేస్తూ మెరుపు హాఫ్ సెంచరీతో జట్టుకు కిరాక్ విక్టరీని అందించాడు.
రంగారెడ్డి రైజర్స్ విధ్వంసం:
190 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రంగారెడ్డి రైజర్స్‌కు బ్యాటర్లు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం లభించింది. ఓపెనర్ ఆదిత్య జవ్వాజి (32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు) జట్టుకు గట్టి పునాది వేయగా.. చివర్లో అవినాష్ రావు (6 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 22 రన్స్) 360 పైగా స్ట్రైక్ రేట్‌తో విరుచుకుపడగా, నితిన్ సాయి యాదవ్ సైతం (9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు నాటౌట్) చెలరేగడంతో కెప్టెన్‌కి తోడుగా నిలిచాడు. కాగా కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ మాత్రం (30 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్సర్లతో ఏకంగా 71 పరుగులతో నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అయితే నల్గొండ బౌలర్లలో అనికేత్ రెడ్డి 2, వరుణ్ గౌడ్ 2, నిశాంత్ ఒక వికెట్ తీసినప్పటికీ రంగారెడ్డి రైజర్స్ జట్టుని అడ్డుకోలేకపోయారు.
నల్గొండ భారీ స్కోరు:
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన నల్గొండ నైట్స్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు గౌరవ్ రెడ్డి (0), ప్రణవ్ సూర్యదేవర (7)తో పాటు అర్ఫాన్ అహ్మద్ (7) ఘోరంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో కెప్టెన్ రాహుల్ బుద్ధి (30), వరుణ్ గౌడ్ (26), పాట్కూరి నితీశ్ రెడ్డి (20) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆరో స్థానంలో వచ్చిన దివేశ్ సింగ్ ( 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సుతో 48 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో హర్షవర్థన్ సింగ్ సైతం (20 బంతుల్లో 40 రన్స్) మెరుపులు మెరిపించడంతో నల్గొండ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 189 పరుగుల స్కోరు చేసింది.
►ALSO READ | గౌరవంగా వచ్చాం.. గౌరవంగానే వెళ్తున్నాం.. ఇరాన్ జట్టు ఎమోషనల్ మెసేజ్ వైరల్!
రంగారెడ్డి బౌలింగ్ కిరాక్:
రంగారెడ్డి రైజర్స్ జట్టు బౌలర్లలో పున్నయ్య అద్భుతంగా బౌలింగ్ చేసి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టగా, నితిన్ సాయి యాదవ్ 2, ఆర్యన్ చరియప్ప 2 వికెట్లతో నల్గొండ జట్టుకి బిగ్ షాక్ ఇచ్చారు. కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ కూడా బౌలింగ్ చేసి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
That's one way to finish a game! 💥
— tg20official (@tg20official) June 22, 2026
Nitin Sai Yadav wasted no time to make a telling impact on the chase, cruising away to 2️⃣6️⃣* off just 9️⃣ deliveries to close out the game for his side!#RRRvANK #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/EDp4AKNMNq
Player of the Match 🏅
— tg20official (@tg20official) June 22, 2026
Who else but the skipper leading the way with a thumping 7️⃣1️⃣* to guide his side to phenomenal win! 💥#RRRvANK #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/6NidDSRgPI
The Ranga Reddy Risers cruise to a dominating win! ✌️
— tg20official (@tg20official) June 22, 2026
Chasing a big target, the Risers stayed in control throughout, with key contributions guiding them to a comfortable win over the Knights. 🥊#RRRvANK #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/bGr9XunTi8
