గౌరవంగా వచ్చాం.. గౌరవంగానే వెళ్తున్నాం.. ఇరాన్ జట్టు ఎమోషనల్ మెసేజ్ వైరల్!

గౌరవంగా వచ్చాం.. గౌరవంగానే వెళ్తున్నాం.. ఇరాన్ జట్టు ఎమోషనల్ మెసేజ్ వైరల్!

Iran Football Team Emotional Note: ఫిఫా ప్రపంచ కప్ 2026లో బెల్జియం జట్టును 0–0తో నిలువరించి సంచలనం సృష్టించిన ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు, మ్యాచ్ అనంతరం ఒక భావోద్వేగపూరితమైన లేఖని తమ డ్రెస్సింగ్ రూమ్ లో వదిలి పెట్టి వెళ్లిపోయారు. లాస్ యాంజెలిస్‌లోని సోఫి స్టేడియం (SoFi Stadium) డ్రెస్సింగ్ రూమ్‌లో ఇరాన్ ప్లేయర్స్ చేత్తో రాసిన ఒక ఎమోషనల్ నోట్‌ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ గా మారింది. 

గౌరవంతో వచ్చాం.. గౌరవంతో వెళ్తున్నాం: 
అమెరికాలో జరిగిన తమ రెండు మ్యాచ్‌ల్లో తమకు భారీగా మద్దతుగా నిలిచిన అభిమానులకు ఇరాన్ జట్టు ధన్యవాదాలు తెలిపింది. ఆ దేశ సుసంపన్నమైన చరిత్రను, వారి పోరాట పటిమను గుర్తుచేస్తూ ఆ లేఖలో ఇలా రాశారు. మేము లాస్ యాంజెలిస్‌కు ఎంతో గర్వంతో వచ్చాము, మైదానంలో అత్యంత గౌరవంతో పోటీపడ్డాము, ఇప్పుడు అంతే హుందాగా ఇక్కడి నుండి నిష్క్రమిస్తున్నాము. ప్రపంచ దేశాలన్నింటి మధ్య శాంతి, గౌరవం, మరియు స్నేహబంధం వర్ధిల్లాలని కోరుకుంటున్నామని తెలిపారు. 

లేఖపై ఈ హ్యాష్‌ట్యాగ్‌లు: 
ఈ లేఖపై ఇరాన్ ప్లేయర్స్ #Minab, #168 అనే హ్యాష్‌ట్యాగ్‌లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం సమయంలో ఇరాన్‌లోని మినాబ్ అనే నగరంలోని ఒక పాఠశాలపై జరిగిన బాంబు దాడికి ఇవి సంకేతాలు. ఈ ఘోర దాడిలో అనేక మంది స్కూల్ పిల్లలు, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరణించిన వారి సంస్మరణార్థం ఇరాన్‌లో 168 అనే సంఖ్యను వాడింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కూడా, ఇరాన్ ఆటగాళ్లు చనిపోయిన పిల్లల జ్ఞాపకార్థం స్కూల్ బ్యాగులు తగిలించుకుని జాతీయ గీతం ఆలపించడం గమనార్హం.

►ALSO READ | ఛీ ఛీ! నేనో ఫెయిల్యూర్ కెప్టెన్‌ని.. శ్రీలంక ఓటమిపై చమరి అథపత్తు కామెంట్స్ వైరల్!

మెక్సికోలో ఉంటూ.. మ్యాచ్ కోసం అమెరికాకు జర్నీ: 
అమెరికాలో ఇరాన్ జట్టు బస చేయడంపై ఉన్న ఆంక్షల కారణంగా, ఈ టోర్నమెంట్ అంతటా ఇరాన్ టీమ్ మెక్సికోలోని టిజువానాలో బస చేస్తోంది. కేవలం మ్యాచ్‌లు ఉన్న సమయంలో మాత్రమే వారు అమెరికాకు ప్రయాణిస్తున్నారు. ఇరాన్ డెలిగేషన్‌లోని పలువురు స్టాఫ్, అధికారులపై ట్రావెల్ ఆంక్షలు ఉండటంతో, యూఎస్ అధికారులు వారి ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.

రౌండ్ ఆఫ్ 32లో అమెరికాతో బిగ్ ఫైట్: 
మైదానం బయట ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, బెల్జియంతో మ్యాచ్ ని డ్రా చేసుకోవడంతో ఇరాన్ జట్టు తమ నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తమ తదుపరి చివరి గ్రూప్-జి మ్యాచ్‌లో గెలిచి ఇరాన్ గనుక నాకౌట్ స్టేజ్‌కు అర్హత సాధిస్తే.. రౌండ్ ఆఫ్ 32లో ఇరాన్ జట్టు నేరుగా అమెరికా (USA) తో తలపడే ఛాన్స్ ఉంది. ఇదే గనుక జరిగితే ప్రపంచ ఫుట్‌బాల్‌లోనే అది అత్యంత హై-వోల్టేజ్ మ్యాచ్‌గా మారడం ఖాయం.