Sri Lanka Captain Chamari Athapaththu: శ్రీలంక మహిళా క్రికెట్ కెప్టెన్ చమరి అథపత్తు తీవ్ర భావోద్వేగానికి లోనైంది. వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో శ్రీలంక జట్టు ఓడిపోవడంతో.. కెప్టెన్‌గా తాను పూర్తిగా ఫెయిల్ అయ్యానంటూ ప్రెస్‌మీట్లోనే కన్నీరు పెట్టుకుంది. దాదాపు 18 ఏళ్లుగా దేశం కోసం ఆడుతున్నప్పటికీ, తన టీమ్ ను కనీసం ఒక్కసారి కూడా వన్డే లేదా టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌కు తీసుకెళ్లలేకపోయాననే బాధ తనను ఎంతగానో కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.
వ్యక్తిగతంగా ఎన్నో సాధించా.. కెప్టెన్‌గా ఫెయిల్యూర్:
మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీలంక కెప్టెన్ చమరి అథపత్తు మాట్లాడుతూ.. ఈ బాధను వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు.. జాతీయ జట్టు కోసం దాదాపు 18 ఏళ్లు ఆడాను.. కానీ నా టీమ్‌ను వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు తీసుకెళ్లే ఛాన్స్ నాకు ఎప్పుడూ రాలేదు.. వ్యక్తిగతంగా నేను ఎన్నో మైలురాళ్లు సాధించి ఉండొచ్చు, కానీ ఒక కెప్టెన్‌గా నేను ఫెయిల్యూర్ అనే అనుకుంటున్నాను.. ఒక ప్లేయర్‌గా ఇది నాకు పెద్ద బాధ.. నేను ఇప్పుడు ఈ నొప్పితోనే బ్రతకాలి అంటూ ఎమోషనల్ అయ్యింది. అలాగే జట్టులో అందరికంటే ఎక్కువ అనుభవం ఉన్న ప్లేయర్‌గా, కెప్టెన్‌గా ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే, నేను మరింత బాధ్యతాయుతంగా ఆడి ఉంటే లంక జట్టు ఈ మ్యాచ్ గెలిచేదంటూ తనను తాను బ్లేమ్ చేసుకుంది చమరి అథపత్తు.
►ALSO READ | అమ్మగా.. క్రికెటర్‌గా.. రెండింటినీ బ్యాలెన్స్ చేసేలా ICC కొత్త పాలసీ
లంక బ్యాటర్ల ఘోర వైఫల్యం:
ఈ లో-స్కోరింగ్ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నప్పటికీ తీవ్రంగా నిరాశపరిచింది. ఇన్నింగ్స్ మొదటి 3 ఓవర్లలోనే కెప్టెన్ చమరి అథపత్తుతో సహా ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఔట్ కావడంతో లంక జట్టు కేవలం 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా కోలుకోలేక కేవలం 98 పరుగులకే కుప్పకూలింది.
సెమీస్ రేసులో విండీస్:
99 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ మహిళల జట్టు కేవలం 5 వికెట్లు కోల్పోయి ఈజీగా టార్గెట్‌ను ఛేజ్ చేసింది. లంక బౌలర్లు మ్యాచ్‌లో ఏ దశలోనూ విండీస్‌పై ఒత్తిడి తీసుకురాలేకపోయారు. శ్రీలంక ఫీల్డర్లు రెండు కీలక క్యాచ్‌లు వదిలేయడంతో పాటు ఏకంగా 23 ఎక్స్‌ట్రాలు (ఇందులో 13 వైడ్‌లు) సమర్పించుకుని ఓటమికి కారణమయ్యారు. ఈ విజయంతో వెస్టిండీస్ జట్టు గ్రూప్-బిలో ఇంగ్లాండ్‌తో సమానంగా నిలిచింది. ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ వరుస విజయాలు సాధించి, సెమీఫైనల్‌కు దూసుకెళ్లేందుకు విండీస్ సిద్ధమైంది.
Strong words from Sri Lanka skipper Chamari Athapaththu following the side's loss to the West Indies at the #T20WorldCup 👀
— ICC (@ICC) June 22, 2026
More 👉 https://t.co/UweSZB4w5b pic.twitter.com/xn9jiu3t3k
