హైదరాబాద్: వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతు పవనాల కదలికలపై వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. గత 15 రోజులుగా అనుకూల పరిస్థితులు లేక భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ వరకు విస్తరించి ఆగిపోయిన రుతు పవనాల్లో కదలిక మొదలైనట్లు పేర్కొంది. సోమవారం (జూన్ 22) నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదిలి నిజామాబాద్ వరకు విస్తరించాయని.. మంగళవారం (జూన్ 23) నాటికి తెలంగాణ అంతటా పూర్తిగా విస్తరించే అవకాశం ఉందని తెలిపింది.
రుత పవనాల విస్తరణతో రాష్ట్రంలో రాబోయే ఐదారు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. వర్షాలతో ఎండల తీవ్రత తగ్గనుంది.
►ALSO READ | SIR: జూన్ 24 నుంచి BLOలు ప్రతి ఇంటికి వస్తారు.. ఓటరు వివరాలు ఇవ్వాలి.. లేదంటే లిస్టు నుంచి పేరు ఔట్
సోమవారం (జూన్ 22) రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్,పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ నగరంలో సైతం సోమవారం (జూన్ 22) రాత్రి తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలు, రైతులను వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతు పవనాల విస్తరణతో వర్షాలు కురవనుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకునే అవకాశం ఉంది.
