స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR-సర్) జూన్ 25 నుండి మొదలవుతుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో SIR ప్రక్రియ జరగనుందని చెప్పారు. జూన్ 24 నుంచి జూలై 24 మధ్య BLO లు ప్రతీ ఓటర్ ఇంటికి వస్తారని.. ఓటర్లు తమ వివరాలు చెప్పాల్సి ఉంటుందన్నారు.
బిఎల్ఓ ప్రతి ఒక్క ఓటరుకు ఎన్యూమరేషన్ ఫార్మ్ ఇస్తారని.. ఓటర్లు ఫార్మ్ నింపాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ఓటర్ అందుబాటులో లేకపోతే.. వారి ఇంటి సభ్యులు నింపి, సంతకం పెట్టి ఇవ్వొచ్చునని చెప్పారు. ఆన్లైన్ లో కూడా ఎన్యూమరేషన్ ఫార్మ్ ఫిల్ చేయొచ్చని తెలిపారు.
2002 లో మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఓటు హక్కు తో లింక్ చేసి.. అందులో ఒక్కరి వివరాలు ఎన్యూమరేషన్ ఫాం లో నింపాల్సి ఉంటుందన్నారు. ఎన్యూమరేషన్ ఫార్మ్ నింపి.. BLO కి ఇవ్వకపోతే SIR లిస్ట్ లో ఓటరు పేరు రాదని తెలిపారు.
ఎన్యూమరేషన్ వివరాల సేకరణ పూర్తయ్యాక ఎలక్టోరల్ రోల్ డ్రాఫ్ట్ జులై 31న విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఎవరైనా ఎన్యూమరేషన్ ఫాం తప్పుగా ఫిల్ చేసినా... ఫాం ఇవ్వకపోయినా వారందరికీ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.
31 జూలై నుంచి ఆగస్టు 30 వరకు నోటీసులు అందుకున్న వారు ERO వద్ద ECI ప్రకటించిన 12 ఐడీ లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుందన్నారు. అక్టోబర్ ఒకటవ తేదీకి తుది ఓటర్ జాబితా ఇవ్వనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ జిల్లాలో SIR మ్యాపింగ్ 46 శాతం అయిందన్నారు. మ్యాపింగ్ లో లేకపోయినా ఎన్యూమరేషన్ నింపిన వారే ఫైనల్ అని తెలిపారు.
►ALSO READ | యూరియా కొరత రైతులకు లేదు.. ఓన్లీ కేటీఆర్, BRS పార్టీలోనే షార్టేజ్: మంత్రి వివేక్
రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి 10 వేల 901 బిఎల్ఏ లు అపాయింట్ అయ్యారన్నారు. బిఎల్ఓ ప్రతి ఓటర్ వద్దకు విజిట్ చేసి ఎన్యూమరేషన్ ఫార్మ్ ఇవ్వాలని చెప్పారు. BLO తో పాటు BLA లు కూడా ఓటర్ల వద్దకు వస్తారని తెలిపారు. BLO తో పాటు BLA లకు ఐడీ కార్డులు ఇస్తామని చెప్పారు.
ఎన్యూమరేషన్ ఫార్మ్ మీద లేటెస్ట్ ఫోటో అతికించాల్సి ఉంటుంది.. ఎన్యూమరేషన్ ఫార్మ్ నింపి బిఎల్ఓ లకు కచ్చితంగా ఇవ్వాలి.. ఎన్యూమరేషన్ నింపిన తర్వాత బిఎల్ఓ లకు ఎంటువంటి ప్రూఫ్స్ ఇవ్వక్కర్లేదు.. హైదరాబాద్ జిల్లా లో 4 వేల62 బిఎల్ఓ లు ఉన్నారు.. ఎన్యూమరేషన్ ఫార్మ్ తప్పుగా నింపితే ERO నోటీసు ఇస్తారు.. Ero నోటిస్ తర్వాత మళ్లీ సరిచేసుకోవచ్చు.. ఒక మనిషికి ఒక్క ఓటు హక్కు మాత్రమే ఉండాలి.. ఓటు ఎక్కడ ఉంటే అక్కడే ఎన్యూమరేషన్ ఫాం నింపి ఇవ్వాలి.. BLO లు తప్పులు చేస్తే చర్యలు తీసుకుంటాం అని ఈ సందర్భంగా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ వెల్లడించారు.
