హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్- అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్) పోస్టుల భర్తీకి ‘మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్’(ఎంహెచ్ఎస్ఆర్బీ) తాజాగా ప్రొవిజనల్ మెరిట్ లిస్టును విడుదల చేసింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఖాళీల ఆధారంగా 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థులను తదుపరి దశకు షార్ట్ లిస్ట్ చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈ నెల 12, 13 తేదీల్లో హైదరాబాద్ వెంగళరావు నగర్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ)లో నిర్వహించనున్నారు.
