హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కొత్త సెక్రటరీగా ఎం. జీవన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు.ఈ పోస్టు కోసం పోటీపడుతున్న మిగతా అభ్యర్థులంతా తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. దాంతో సెక్రటరీకి ఎన్నిక అవసరం లేదని రిటర్నింగ్ అధికారి వీఎస్ సంపత్ మంగళవారం ప్రకటించారు.
మరోవైపు ట్రెజరర్ పోస్టు కోసం నలుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. వి. ఆగం రావు, కె. అనిల్ కుమార్, బాబురావు, హరినారాయణ రావు పోటీలో ఉన్నారు. ఈ నెల 15న ఉప్పల్ స్టేడియంలో పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాన్ని వెల్లడిస్తారు.
