దుబాయ్: టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా పడింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్‌పైకి ప్రమాదకరమైన రీతిలో బాల్ విసిరినందుకు అర్ష్‌దీప్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. అలాగే ఒక డీమెరిట్ పాయింట్‌ను కేటాయించారు.
గత రెండేండ్ల కాలంలో ఇదే తొలి తప్పిదం కావడంతో పెద్దగా చర్యలు తీసుకోలేదు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.9 రూల్‌ను అర్ష్‌దీప్ ఉల్లంఘించినట్లు తేల్చారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో అర్ష్‌దీప్ తన ఫాలో త్రూలో బాల్‌ను అందుకుని దూకుడుగా మిచెల్‌పైకి విసిరాడు.
