పంతంగి టోల్ ప్లాజా మీదుగా సొంతూళ్లకు వెళ్తున్న పబ్లిక్కు ముఖ్య గమనిక

పంతంగి టోల్ ప్లాజా మీదుగా సొంతూళ్లకు వెళ్తున్న పబ్లిక్కు ముఖ్య గమనిక

హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ సొంతూర్లకు బయలుదేరే వాహనాలకు ఇబ్బందులు లేకుండా టోల్ ప్లాజాల దగ్గర పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర మొత్తం16 లేన్స్లో 8 మార్గాల్లో విజయవాడ వైపు వాహనాలు అనుమతిస్తున్నారు. రద్దీ పెరిగితే ఇంకో రెండు పెంచి 10 లేన్స్లో అనుమతిస్తారు. వాహనాలు బ్రేక్ డౌన్ జరిగితే ట్రాఫిక్ జామ్ జరిగే అవకాశం లేకుండా వాటికి తగ్గ చర్యలు తీసుకుంటున్నారు. 

టోల్ ప్లాజా లేన్స్ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ మొరాయిస్తే హ్యాండ్ స్కానర్ ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రతీ లేన్లో రెండు హాండ్ స్కానర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జాతీయ రహదారిపై ఎక్కడా ట్రాఫిక్ జామ్ జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. టోల్ ప్లాజాల దగ్గర వేలాదిగా వాహనాలు వచ్చినా ట్రాఫిక్ జామ్ లేకుండా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారి పై ఉన్న పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు ప్రత్యేక క్యాంపుతో పాటు పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ శివారు నుంచి తెలంగాణ బార్డర్ వరకు ట్రాఫిక్ రద్దీ పర్యవేక్షణకు ప్రత్యేక పెట్రోలింగ్ టీమ్లను ఏర్పాటు చేశారు.

►ALSO READ | మహిళా ఐఏఎస్ ఆఫీసర్లపై అనుచిత.. అసభ్యకర ప్రచారం... మహిళా మంత్రి సీరియస్..

ట్రాఫిక్ రద్దీని పర్యవేక్షించేందుకు పోలీసులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మొత్తం 150 మంది ట్రాఫిక్ సిబ్బంది, 8 మంది ఇన్స్పెక్టర్లు, ఒక ఏసీపీతో బందోబస్తు ఉంటుంది. రెండు షిఫ్ట్లలో పోలీసులు విధుల్లో ఉంటారు. టోల్ ప్లాజా దగ్గర అంబులెన్స్ సౌకర్యం ఉంటుంది.