వివాదాస్పద ట్వీట్లతో తరచూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారి తీశారు. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలపై మరోసారి ట్వీట్ చేసి హాట్ టాపిక్గా నిలిచారు. లేటెస్ట్గా “అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జీసస్, అల్లా మధ్య ఫైట్ లాంటిదే. ఎవరు గెలిస్తే ఆ మతంలోకి నేను మారతా” అని ట్వీట్ చేశారు.
The fight between AMERICA and IRAN is the fight between JESUS and ALLAH.. whoever wins I will CONVERT to that 💪💪💪
— Ram Gopal Varma (@RGVzoomin) March 3, 2026
ప్రస్తుతం ఈ వ్యాఖ్యపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. కొందరు ఇది వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్య అని భావిస్తుండగా, మరికొందరు మాత్రం మతాలను ప్రస్తావిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని విమర్శిస్తున్నారు. ఎప్పటికప్పుడు సంచలన ట్వీట్లతో నెటిజన్లని దృష్టిని ఆకర్షించే, రామ్ గోపాల్ వర్మ ఈసారి కూడా అదే విధంగా వార్తల్లో నిలిచారు.
ఆర్జీవీ ట్వీట్ వెనుక ఉద్దేశ్యం!
అయితే, అగ్రరాజ్యమైన అమెరికాలో మెజారిటీ జనాలు క్రిస్టియన్లే ఉంటారు. అక్కడ ప్రతిఒక్కరూ జీసస్ ను ఆరాధిస్తారు. అంటే యేసు ప్రభువును నమ్ముతారు. మరోవైపు ఇరాన్ ఒక ఇస్లామిక్ దేశం. అక్కడి ప్రజల్లో ఎక్కువ మంది ఇస్లాం మతాన్ని అనుసరిస్తూ అల్లాను ప్రార్థిస్తారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని జీసస్ మరియు అల్లా మధ్య పోరుగా పోలుస్తూ ఆర్జీవీ ట్వీట్ చేయడం గమనార్హం!
డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు!
మార్చి 3న ఆర్జీవీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా ట్వీట్ చేశారు. “Might is Right” అనే కొటేషన్ ని ప్రస్తావిస్తూ, తన చిత్రం సర్కార్ లోని డైలాగ్‌ను ఉదహరించారు: “జిస్కే పాస్ పవర్ హై, ఉస్కా రాంగ్ భీ రైట్ హోజాతా హై”.. తెలుగులో.. “బలవంతుడు ఏం చేసినా రైట్. ‘ఎవరి దగ్గర అయితే పవర్ ఉంటుందో వాళ్లు తప్పు చేసినా కరెక్టే అవుతుంది” అని సర్కార్ సినిమాలో సెల్వర్ మణి డైలాగ్ ని పోస్ట్ చేశాడు.
Taking off from the age old line MIGHT IS RIGHT and Selvar Mani’s dialogue from Sarkar “ Jiske paas power hai , uska wrong bhi right hojata hai “ @realDonaldTrump is RIGHT because he has MIGHT
— Ram Gopal Varma (@RGVzoomin) March 3, 2026
అలాగే, “డొనాల్డ్ ట్రంప్ రైట్ ఎందుకంటే ఆయనకు మైట్ ఉంది” అని వర్మ రాశారు. అంటే.. ఈ ట్వీట్ ద్వారా డోనాల్డ్ ట్రంప్ రైట్ అనేలా ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ప్రస్తుతం ట్రంప్ దగ్గర బలముంది’’ అనేది ఆర్జీవీ ఉద్దేశ్యం.
యుద్ధాన్ని సినిమాలతో పోల్చిన వ్యాఖ్య!
మార్చి 1న వర్మ మరో వివాదాస్పద ట్వీట్ చేశారు. అమెరికా–ఇరాన్ ఘర్షణను ‘ధురంధర్ 2’ vs ‘టాక్సిక్’ సినిమాల బాక్సాఫీస్ పోటీతో పోలుస్తూ ట్వీట్ చేశారు. “ఒకదాంట్లో మనుషులు చనిపోతారు, మరొకదాంట్లో డబ్బులు చనిపోతాయి” అని వ్యాఖ్యానించడం విమర్శలకు దారితీసింది.
అలాగే, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ దాక్కున్నారని, కానీ డోనాల్డ్ ట్రంప్ దాక్కోలేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో వర్మ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యారు.
I was soooo waiting for #USAIRAN conflict as much as #Dhuroxic conflict 🔥 ..In one people will die , and in the other Monies will die
— Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2026
