టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'చైన్నై లవ్ స్టోరీ'. భారీ అంచనాలతో జూలై 24న ప్రేక్షకుల ముందు వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయితే సాంగ్స్, టీజర్ విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ మూవీపై అంచనాలను మరింత పెంచాయి. ఈ వారం థియేటర్లలోకి వస్తున్న ఏకైక ఫీల్ గుడ్ రొమాంటిక్ తెలుగు మూవీ ఇదే.
లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి కీలక అప్టేట్ ఒకటి వచ్చింది. రేపు ( జూలై 22, 2026 ) గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈవేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మించారు. మణి శర్మ సంగీతం అందించారు.
ఈఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా 'చెన్నై లవ్ స్టోరీ' ఐటీ హబ్‌ల మధ్య, లవ్ అండ్ కెరీర్ డ్రీమ్స్ మధ్య సాగే ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ జర్నీ. చెన్నైలో తన కలలను సాకారం చేసుకునే క్రమంలో ప్రేమలో పడిన ఇద్దరు యువతి , యువకుడి భావోద్వేగ ప్రయాణాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించారు.
మరో వైపు ఈ చిత్రాన్ని గురువారం రాత్రి ( జూలై 23, 2026 ) పెయిడ్ ప్రీమియర్ షోలను ప్రదర్శించాలని నిర్మాతలు నిర్ణయించారు. దాదాపు ఈ మూవీ 3 గంటల నిడివితో ఉంది. పెయిడ్ ప్రీమియర్ షో కోసం బుకింగ్స్ కూడా ప్రారంభమైయ్యాయి. ఈ తొలి షో నుంచే సానుకూల స్పందన వస్తే .. వారాంతంలో ఈ రొమాంటిక్ డ్రామా మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని మేకర్స్ ధీమా ఉన్నారు.
మరో వైపు జూలై 23న కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం విజయ్ చివరి చిత్రం 'జననాయగన్' భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టికెట్లు హాట్ కేక్ లా అమ్ముడవుతున్నాయి. ఇలాంటి సమయంలో 'చెన్నై లవ్ స్టోరీ' థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద విజయ్ మూవీని దాటుకుని కిరణ్ అబ్బవరం మూవీ ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.
