మహిళా ఐఏఎస్ ఆఫీసర్లపై అనుచిత.. అసభ్యకర ప్రచారం... మహిళా మంత్రి సీరియస్..

మహిళా ఐఏఎస్  ఆఫీసర్లపై అనుచిత.. అసభ్యకర ప్రచారం... మహిళా మంత్రి సీరియస్..

తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారులపై అసభ్య, అనుచిత ప్రచారంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. మహిళలపై ద్వేషం, అవమానంతో కూడిన ప్రచారానికి సమాజం మొత్తం వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉందని,  మహిళల గౌరవం ప్రజాస్వామ్యాన్ని  కాపాడాల్సిన బాధ్యత అందరిదని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

తెలంగాణలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తోందని, అటువంటి పరిస్థితుల్లో మహిళా అధికారులను కించపరిచే వ్యాఖ్యలను, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రచారాన్ని సహించబోమని మంత్రి  స్పష్టం చేశారు.మహిళలు ఉన్నత స్థాయికి చేరితే తట్టుకోలేని ఫ్యూడల్ మానసిక స్థితే.. దుష్ప్రచారాలకు కారణమంటూ...  మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 

►ALSO READ | జీవో 252లో మార్పులు చేర్పులు చేస్తం.. గ‌తంలో కంటే ఎక్కువ‌గానే అక్రిడిటేష‌న్ కార్డులు ఇస్తం: మంత్రి పొంగులేటి

 బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజాసేవలో నిమగ్నమైన మహిళా ఐఏఎస్ అధికారుల గౌరవాన్ని దెబ్బతీయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని .. వారి వెనుక రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా నిలుస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. మహిళా అధికారులను దూషించి.. అసభ్యకర  వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హెచ్చరించారు.