మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' (Peddi). ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలు రికార్డు సృష్టిస్తున్నాయి. మరో వైపు ఈ సినిమా బిజినెస్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' ప్రభంజనం
ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా, కేవలం తెలుగు వెర్షన్ ప్రీ-రిలీజ్ బిజినెస్‌యే దాదాపు రూ. 200 కోట్లు దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు 'పెద్ది' మూవీని భారీ ధరలకు హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు రూ. 40 కోట్లకు అమ్ముడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ ఏడాది ఒక తెలుగు సినిమాకు జరిగిన అత్యుత్తమ డీల్స్‌లో ఇది ఒకటిగా నిలిచింది..
రికార్డు స్థాయి ఓవర్సీస్ డీల్
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఓవర్సీస్ హక్కులు రూ. 13 కోట్లకు అమ్ముడవగా, 'పెద్ది' దానికంటే మూడు రెట్లు ఎక్కువ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో రామ్ చరణ్‌కు ఉన్న విపరీతమైన ఫ్యాన్ బేస్ ఈ డీల్‌కు ప్రధాన కారణం. విదేశాల్లో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే సుమారు 9 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అంచనాలను పెంచేలా సాంగ్స్
ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం మరో పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ 'చికిరి చికిరి' చార్ట్‌బస్టర్‌గా నిలవగా, తాజాగా విడుదలైన రెండో సింగిల్ 'రై రై రా రా' సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ పాటలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
గ్రామీణ నేపథ్యంతో సాగే కథతో..
ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. 1980ల నాటి గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ కథలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బొమ్మన్ ఇరానీ వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగంగా దూసుకుపోతోంది. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!
