యాదవులకు రేవంత్రెడ్డి ప్రయారిటీ : సమాచార మాజీ కమిషనర్ వెంకటేశ్వర్లు యాదవ్

యాదవులకు రేవంత్రెడ్డి ప్రయారిటీ :  సమాచార మాజీ కమిషనర్ వెంకటేశ్వర్లు యాదవ్

ముషీరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత యాదవ సమాజానికి రాజకీయ, పరిపాలనా రంగాల్లో సముచిత ప్రాధాన్యం కల్పించడం అభినందనీయమని మాజీ ప్రధాన సమాచార కమిషనర్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యుడు డాక్టర్ వరే వెంకటేశ్వర్లు యాదవ్ అన్నారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య కళాభవన్‌లో జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ అధ్యక్షతన వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా, ఇతర రాష్ట్రస్థాయి పదవులకు నియమితులైన యాదవ నాయకుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. 

ముఖ్య అతిథిగా హాజరైన వరే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి యాదవుల అభ్యున్నతికి కృషి చేస్తూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితర కీలక పదవుల్లో అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. యాదవుల సంప్రదాయ పండుగ సదరును రాష్ట్ర పండుగగా గుర్తించి అన్ని జిల్లాల్లో అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరమ్మ యాదవ్, కె.సరిత తిరుపతయ్య యాదవ్, డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, గజ్జి భాస్కర్ యాదవ్ పాల్గొన్నారు.