ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) టెక్నీషియన్ అప్రెంటీస్ / ట్రేడ్ అప్రెంటీస్ / గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు మార్చి 2న ప్రారంభమవుతుంది. మార్చి 9న ముగుస్తుంది.
ఖాళీలు: 144.
ఎలిజిబిలిటీ
టెక్నీషియన్ అప్రెంటీస్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో మూడేండ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
ట్రేడ్ అప్రెంటీస్: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: కనీసం 50 శాతం మార్కులతో బీఏ, బి.కాం., బీఎస్సీ, బీబీఏ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది
డేటా ఎంట్రీ ఆపరేటర్: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది
వయోపరిమితి: 18 నుంచి 24 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 2.
లాస్ట్ డేట్: మార్చి 9.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు iocl.com వెబ్‌సైట్‌ను సందర్శించండి .
