ఏ ముహూర్తాన యుద్ధం మొదలైందో ఏమో.. అమెరికా, ఇరాన్ యుద్ధం కాస్తా ఇప్పుడు.. గల్ఫ్ యుద్ధంగా మారిపోయింది. ఇరాన్ దేశంపై ఇప్పటికే అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే.. ఇక నుంచి మేం కూడా నేరుగా యుద్ధంలోకి దిగుతున్నాం.. ఇరాన్ పై మా స్థాయిలో మేం యుద్ధం చేస్తాం అంటూ ప్రకటించింది సౌదీ అరేబియా. ఇరాన్ దాడులను తిప్పికొట్టటానికి మేం సిద్ధంగా ఉన్నాం అంటూ సౌదీ రాజు ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించటం సంచలనంగా మారింది. ఇప్పటి వరకు గల్ప్ దేశాల్లోని తమ సైనిక స్థావరాల నుంచి అమెరికా యుద్ధం చేస్తుంది.. ఇప్పుడు సౌదీ నేరుగా యుద్ధంలోకి దిగుతుండటంతో.. గల్ప్ దేశాలన్నీ అనివార్యంగా యుద్ధంలోకి దిగుతున్నట్లు స్పష్టం అయ్యింది.
మంత్రి వర్గంతో అత్యవరసరంగా భేటీ అయిన సౌదీ రాజు ప్రిన్స్ సల్మాన్.. గల్ఫ్ దేశాల మధ్య సంఘీభావం ఉందని.. గల్ఫ్ దేశాలకు ముప్పు వస్తే.. మిగతా దేశాలన్నీ మద్దతు ఇవ్వటానికి రెడీగా ఉన్నాయని ప్రకటించారాయన.
మరోవైపు గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇరాన్ పౌరులపై నిఘా పెట్టాయి ఆయా దేశాలు. ఈ క్రమంలోనే ఖతార్ లో 10 మంది ఇరాన్ గూఢచారులను అరెస్ట్ చేశారు అధికారులు. గల్ఫ్ దేశాల్లో చాలా మంది ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC గూఢచారులుఉన్నారని గుర్తించామని.. వాళ్లందరిపై నిఘా పెట్టామని.. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసినట్లు సౌదీ రాజు సల్మాన్ ప్రకటించారు.
ఇరాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు నేరుగా దాడులు చేయటానికి సిద్ధంగా ఉన్నామని.. సౌదీపై దాడులు చేస్తుంటే చూస్తూ కూర్చోమని.. ఇరాన్ కు బుద్ధి చెప్పటానికి నేరుగా దాడులు చేస్తామని.. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో కలిసి.. ఇరాన్ పై యుద్ధం చేస్తామని సౌదీ రాజు సల్మాన్ ప్రకటింటంతో.. ఇప్పుడు ఇది గల్ఫ్ మొత్తం నేరుగా యుద్ధంలోకి దిగినట్లు అయ్యింది.
