కలియుగ వైకుంఠం తిరుమలలో దారుణం జరిగింది.. అలిపిరి పార్కింగ్ దగ్గర జింకపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బుధవారం ( మార్చి 4 ) వేకువజామున 3:30 గంటల సమయంలో జరిగింది ఈ ఘటన. ఈ క్రమంలో అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు భక్తులను అలర్ట్ చేశారు. నడక మార్గంలో భక్తులు ఒంటరిగా వెళ్లోద్దని సూచించారు.
ఇటీవల అలిపిరి పరిసరాల్లో పులుల సంచారం ఎక్కువవుతున్న క్రమంలో భయాందోళనకు గురవుతున్నారు శ్రీవారి భక్తులు. నడక మార్గం దగ్గర పులుల సంచారంపై అధికారులు దృష్టి పెట్టాలని.. తగిన చర్యలు చేపట్టి భక్తులను రక్షించాలని కోరుతున్నారు. అంతే కాకుండా.. ఇటీవల తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా తరచూ జరుగుతున్న ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి భక్తులు.
తిరుమల కొండపై రీల్స్ చేస్తున్నవారి సంఖ్య పెరుగుతున్న క్రమంలో.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టి తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతున్నారు భక్తులు.
