IND vs NZ: టాప్-5 ఫిక్స్.. సిరాజ్‌కు ఛాన్స్.. తొలి వన్డేకి టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

IND vs NZ: టాప్-5 ఫిక్స్.. సిరాజ్‌కు ఛాన్స్.. తొలి వన్డేకి టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

భారత క్రికెట్ జట్టు 2026లో తొలి సిరీస్ ఆడేందుకు సిద్దమైంది. న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఆదివారం (జనవరి 11) జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. వడోదర వేదికగా BCA స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తోంది. తొలి వన్డేలో భారత జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. సొంతగడ్డపై ఆడుతుండడంతో పాటు కెప్టెన్ శుభమాన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టులో చేరారు. సీనియర్ ప్లేయర్ సిరాజ్ కూడా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. స్టార్ ప్లేయర్స్ అందరూ అందుబాటులో ఉండడంతో తొలి వన్డేలో టీమిండియా ఆడబోయే జట్టుపై ఆసక్తి నెలకొంది. 

కెప్టెన్ శుభమాన్ గిల్ జట్టులోకి చేరడంతో రోహిత్ శర్మతో ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ కు గాయం కారణంగా దూరమైన గిల్.. జైశ్వాల్ స్థానంలో ప్లేయింగ్ 11 లోకి రానున్నాడు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తాడు. నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ స్థానానికి తిరుగు లేదు. ఆస్ట్రేలియా సిరీస్ లో గాయపడిన అయ్యర్.. గైక్వాడ్ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ గా కేఎల్ రాహుల్ ఆడతాడు. టాప్ -5 వరకు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో ఎలాంటి మార్పులు ఉండవు.

వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తో పాటు యశస్వి జైశ్వాల్ బెంచ్ కే పరిమితం కానున్నారు. ముఖ్యంగా జైశ్వాల్ తన చివరి మ్యాచ్ లో సెంచరీ కొట్టినా తుది జట్టులో లేకపోవడం బ్యాడ్ లక్. ఆరో స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి లేదా వాషింగ్ టన్ సుందర్ లలో ఒకరికి ఛాన్స్ దక్కనుంది. స్పిన్ వికెట్ కావడంతో సుందర్ వైపే మొగ్గు చూపొచ్చు. ఏడో స్థానంలో జడేజా స్థానానికి ఎలాంటి డోకా లేదు. ఏకైక స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. పేసర్లుగా అర్షదీప్ సింగ్ జట్టులో ఉంటాడు. సిరాజ్, హర్షిత్ రానా, ప్రసిద్ కృష్ణలలో ఇద్దరికి చోటు దక్కనుంది. రిపోర్ట్స్ ప్రకారం ప్రసిద్ బెంచ్ కు పరిమితం కావొచ్చు. 

న్యూజిలాండ్ తో తొలి వన్డేకు ఇండియా ప్లేయింగ్ 11 (అంచనా):

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్