యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరిలో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ లోని మహబ్బత్పూర్కు చెందిన సనౌల్ షేక్ కొంతకాలంగా భువనగిరిలో ఉంటున్నాడు. సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు సనౌల్ షేక్ గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తూ దొరికాడు.
అతడి వద్ద 170 గ్రాముల గంజాయితో పాటు 2400 గ్రాముల గుర్తు తెలియని మత్తు పదార్థం పట్టుబడింది. అతడిపై ఎన్డీపీఎస్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని ఎక్సైజ్ ఎస్పీ విష్ణుమూర్తి తెలిపారు.
