- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు: ఇండ్లు లేని ప్రతి నిరుపేదకూ పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతీ ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్టలోని గుండ్లపల్లికి చెందిన లబ్ధిదారులు దూషెట్టి లలిత- రాంచంద్రయ్య గౌడ్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున పేదలకు మంజూరు చేసిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణీ భరత్ గౌడ్, వైస్ చైర్ పర్సన్ బరిగె రమ్య రాంచందర్ ఉన్నారు.
