వనపర్తి సెగ్మెంటుకు 5 సింగిల్ విండోలు : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి సెగ్మెంటుకు 5 సింగిల్ విండోలు : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి/ఖిల్లాగణపురం, వెలుగు :  వనపర్తి నియోజకవర్గంలో రైతుల ప్రయోజనార్థం అయిదు సింగిల్​ విండోల ఏర్పాటుకు అనుమతి  తీసుకొచ్చామని, అడిగిన వెంటనే సీఎం  రేవంత్​రెడ్డి మంజూరు చేశారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. మంగళవారం ఖిల్లాగణపురం, పెద్దమందడి మండలాల పార్టీ మండల కమిటీ ఎన్నికల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఖిల్లాగణపురంలోని సోలిపూరు సింగిల్​ విండో, రేవల్లి, ఏదుల, శ్రీరంగాపురం, వనపర్తి మండలంలో పెద్దగూడెం-కడుకుంట్ల సింగిల్​ విండోలను మంజూరు చేశారని తెలిపారు.

జిల్లా కాంగ్రెస్​పార్టీ ఎలాంటి గ్రూపులు లేవని ఉన్నది ఒక్కటే కాంగ్రెస్​ గ్రూపు అని తెలిపారు. కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్​  శ్రీనివాస్ గౌడ్,  టీపీసీసీ జనరల్ సెక్రెటరీ యాదయ్య, నాయకులు రాజేంద్రప్రసాద్ యాదవ్, రవీందర్ రెడ్డి, రమేష్ గౌడ్, విజయ్ కుమార్,  సాయి చరణ్ రెడ్డి పాల్గొన్నారు.