99 రోజుల కార్యాచరణను సక్సెస్ చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

99 రోజుల కార్యాచరణను సక్సెస్ చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హుస్నాబాద్/ అక్కన్నపేట, వెలుగు: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ను సక్సెస్ చేయాలని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో 99 రోజుల కార్యాచరణపై ఆయన రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 12 వరకు ఈ ప్రోగ్రాం కొనసాగుతుందన్నారు. అధికారులు ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని, యువత ఫిజికల్ యాక్టివిటీ పెంచుకునేలా క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతి గ్రామంలో ‘స్టీల్ బ్యాంక్’ వినియోగంలోకి తీసుకురావాలన్నారు.

వేసవిలో నీటి ఎద్దడి రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌లో  నిర్వహించిన దావత్ -ఏ-ఇఫ్తార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొని ముస్లింలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు పోతారం(ఎస్) గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకా, ఇందిరా మహిళా శక్తి పథకం కింద గ్రామంలో ఏర్పాటు చేసిన పరమేశ్వర సిమెంట్ బ్రిక్స్ ఇండస్ట్రీలను ప్రారంభించారు.

 ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ మహిళా సంఘాలు చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. తన క్యాంప్ ఆఫీసులో ఉన్న ఆవు ఆరు లీటర్ల పాలు ఇస్తుందని, ప్రతి రైతు పాడిని పెంచుకుంటే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర హౌజ్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ దండి లక్ష్మి, వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ పద్మ, డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏ పీడీ జయదేవ్ ఆర్య పాల్గొన్నారు.