ఖమ్మం టౌన్, వెలుగు : త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి, రాజకీయ ప్రతినిధులతో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎం, వీవీప్యాట్లు ఉన్న గదిని పరిశీలించి, తనిఖీ రిజిస్టర్ లో సంతకం చేశారు.
అలారం, ఫైర్ సేఫ్టీ పరికరాలు పరిశీలించి, సెక్యూరిటీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు.
