వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయ నూతన ఈవోగా ఇమ్మడి భాస్కర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈవోగా పనిచేసిన బిల్లా శ్రీనివాస్ బుగులోను, కోటాంచ జాతరల ఈవోగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హనుమకొండ జిల్లా వేలేరు మండల ఎంపీవోగా కొనసాగుతున్న భాస్కర్ బాధ్యతలు చేపట్టారు. కాగా, రామప్ప టెంపుల్ను భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి బృందం సందర్శించింది.
