జ్యోతిష్యం : గ్రహాల కదలికలో భారీ మార్పు.. జనవరి 13 టూ 18 మధ్య పంచగ్రహకూటమి.. ఏడు రాశుల వారికి అదృష్టయోగం.. మిగతా వారికి ఎలా ఉందంటే..!

జ్యోతిష్యం :  గ్రహాల కదలికలో భారీ మార్పు.. జనవరి 13 టూ 18 మధ్య పంచగ్రహకూటమి.. ఏడు రాశుల వారికి అదృష్టయోగం.. మిగతా వారికి ఎలా ఉందంటే..!

కొత్త సంవత్సరం  (2026)  జనవరి 13 నుంచి 18 వరకు మకర రాశిలో మొత్తం ఐదు గ్రహాలు( శుక్రుడు, సూర్యుడు, కుజుడు, బుధుడు, చంద్రుడు)  కలిసి పంచగ్రహ యోగాన్ని ఏర్పరచనున్నాయి.  . దీంతో మకరరాశిలో పంచగ్రహకూటమి ఏర్పడనుంది.  దీని ప్రభావం 12 రాశులపై ఉంటుంది. అయితే ఏడు రాశులకు  మాత్రం లాభాలు తెచ్చిపెట్టనుంది.  ఈ ఏడు రాశులతో పాటు మిగతా రాశులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ..

జ్యోతిష్య నిపుణలు తెలిపిన వివరాల ప్రకారం.. . జనవరి 13న శుక్రుడు ... 14న సూర్య భగవానుడు ...16న కుజుడు ... 17న బుధుడు ... 18న చంద్రుడు మకరరాశిలో కలసి పంచగ్రహకూటమి రాజయోగం ఏర్పడనుంది. 

మేషరాశి: ఈ  వారికి  గ్రహాల కదలికలో మార్పు కారణంగా ఆర్థిక పరిస్థితి బలపడటమే కాకుండా..  ప్రతి పనిలో కూడాయ  మంచి విజయం సాధిస్తారు. కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పంచగ్రహకూటమి వలన  మీ విశ్వాసం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  

వృషభ రాశి : ఈ రాశికి మకరరాశిలో పంచగ్రహకూటమి వలన  ఆర్థికంగా పుంజుకునే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతాయి.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగాఉంటుంది.  పెండింగ్​ పనులు పూర్తవుతాయి. పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు.  సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 

మిథున రాశి  : ఈ రాశి వారు కెరీర్​ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. గతంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులు అనుకున్న పనిని పూర్తి చేస్తారు.  వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొత్త ప్రాజెక్ట్​లు చేపట్టే అవకాశం ఉంది. 

కర్కాటక రాశి  : ఈ రాశి వారికి అన్ని విధాల కలసి వస్తుందని పండితులు చెబుతున్నారు.  ఆర్థిక లాభాలతో పాటు.. సమాజంలో మంచి పేరు దక్కుతుంది.  కొత్త అగ్రిమెంట్లు చేసుకొనే అవకాశం ఉంది.  గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావడంతో మానసికంగా ప్రశాంతతను పొందుతారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

సింహ రాశి  : ఈ రాశి వారు అనుకున్న పనులను సునాయాశంగా పూర్తి చేస్తారు. పంచగ్రహకూటమి రాజ యోగం వలన కెరీర్​ విషయంలో పురోగతి కలిగే అవకాశం ఉంది, ఆర్థిక విషయాల్లో నిర్ణయం తీసుకొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది.  ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతా సవ్యంగానే కొనసాగుతుంది. 

కన్యారాశి: ఈ రాశి వారు పంచగ్రహకూటమి వలన   కెరీర్​ పరంగా ఉన్నసమస్యలు తొలగిపోతాయి. ఏ పని మొదలు పెట్టినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సానుకూలంగా సాగిపోతాయి. గతంలో పెండింగ్​ లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి.  పెళ్లి కోసం ఎదురుచూసే వారికి అనుకున్న సంబంధం నిశ్చయం అవుతుంది.  వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితంలో అనేక సానుకూల మార్పులు ఉంటాయని పండితులు చెబుతున్నారు. 

తులారాశి :  ఈ రాశి వారికి పంచగ్రహకూటమి చాలా శుభసమయమని పండితులుల చెబుతున్నారు.  ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది.  కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.  కొత్త పెట్టుబడులు అధిక లాభాలను తీసుకొస్తాయి.  ఉద్యోగస్తులు ఆఫీసులో కీలక పాత్ర పోషించడంతో.. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు లభించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

వృశ్చికరాశి : ఈ రాశి వారికి మకర రాశిలో పంచగ్రహ కూటమి వలర  ప్రతికూల ఫలితాలుంటాయి. అనవసరమైన విషయాల జోలికి వెళ్లవద్దు.  ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి.  ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు.  ఆరోగ్య పరంగా కూడా సమస్యలు ఉంటాయి.  ఉద్యోగస్తులు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దని పండితులు సూచిస్తున్నారు. 

ధనుస్సు రాశి  : ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. వృత్తి.. వ్యాపారం విషయంలో అనుకోని లాభాలు ఏర్పడుతాయి.  ఆర్థికంగా స్థిరత్వం లభించే అవకాశం ఉంది.  ఆత్మగౌరవం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. కెరీర్​ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.   వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. . . ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. 

మకరరాశి:   ఇదే రాశిలో  పంచగ్రాహి యోగం ఏర్పడుతుంది.  కెరీర్​ విషయంలో అనుకోని మార్పులు కలుగుతాయి,  ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  పూర్వీకుల ఆస్తి కలసి రావడంతో విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.  కొత్త ప్రాజెక్టులు, అవకాశాలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కుంభరాశి  : ఈ రాశి వారికి కేరీర్​ విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి. ఆర్థికవిషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. వృత్తి పరంగా.. వ్యాపార పరంగా కొన్ని ఆటంకాలు కలుగుతాయి.  అనవసర విషయాల జోలికి వెళ్లవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ప్రతి విషయంలో కూడా ఓర్పు.. సహనం పాటించండి.  ఆరోగ్య వి షయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

మీనరాశి: ఈ రాశి వారికి పంచగ్రహ కూటమి వలన  కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.  కీలక విషయాల్లో నిర్ణయం తీసుకొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకోండి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.  అయినా నిరుత్సాహ పడకండి.  అంతా మంచే జరుగుతుంది.  వ్యాపారస్తులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ల దగ్గర డబ్బులు నిలవదు. ఎంత వచ్చినా అంతే స్థాయిలో ఖర్చు ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని పండితులు సూచిస్తున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.