ఇల్లు నిర్మించుకొనే విషయంలో కచ్చితంగా వాస్తు సిద్దాంతాన్ని పాటిస్తాం. ఒక్కో ఇల్లు ఒక్కో షేప్ లో ఉంటుంది. ఏ ఆకారంలో ఉండాలి. బెడ్ రూం ఎలా ఉండాలి.. ఇంటి వెనుక కాలువ ఉంటే నష్టాలొస్తాయా . .. మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ ( 9440088799) గారి సలహాలను ఒకసారి చూద్దాం
ప్రశ్న: మేము ఇల్లు కట్టుకుంటున్నాం బిల్డింగ్స్ షేపు విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. బిల్డింగ్ ఏ పేపులో కట్టుకుంటే బాగుంటుంది?
జవాబు: బిల్డింగ్ షేపు రెక్టాంగిల్ లేదా స్క్వేర్ షేపులో మాత్రమే ఉండాలి. అలాంటి ఇళ్లలో ఉండటం వల్ల డెవలప్మెంట్ ఉంటుంది. కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. ఇళ్లలోని బెడ్ రూమ్స్ కూడా రెక్టాంగిల్ షేపులోనే ఉండాలి. ఇతర షేపుల్లో ఉంటే అనారోగ్యసమస్యలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు పడతారు.
►ALSO READ | Kitchen Telangana: స్వీట్ కార్న్ సీడ్స్.. అదిరిపోయే శ్నాక్స్.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
ప్రశ్న: మా ఇల్లు ఊరి శివారులో ఉంది. ఇంటికి పడమర వైపున కాలువ పారుతోంది. ఇంటికి దగ్గరగా కాలువ పారొద్దని ఒక పూజారి చెప్పాడు. ఇది ఎంత వరకు నిజం?
జవాబు : ఇంటికి దక్షిణం, పడమర వైపు నీళ్ల ప్రవాహం మంచిది కాదు. ఆ దిక్కుల్లో నీళ్లు ప్రవహించడం వల్ల ఇంటికి చెడు జరుగుతుంది. అభివృద్ధి ఉండదు. అనారోగ్య సమస్యలు వస్తాయి. నీళ్ల ప్రవాహం ఉత్తరం లేదా తూర్పు దిక్కుల్లో పారితే, ఆ ఇంటికి మంచి జరుగుతుంది
