జ్యోతిష్యం : చంద్ర గ్రహణం, హోలీ ఒకే రోజు.. మార్చి 2 లేదా3 తేదీల్లో ఏ రోజు.. సరైన ముహూర్తం తెలుసుకోండి..

జ్యోతిష్యం : చంద్ర గ్రహణం, హోలీ ఒకే రోజు.. మార్చి 2 లేదా3 తేదీల్లో ఏ రోజు.. సరైన ముహూర్తం తెలుసుకోండి..

ఈ సంవత్సరంలో (2026)  తొలి చంద్రగ్రహణం మార్చి 3న సంభవించనుంది. అదే రోజు హోలీ పండుగ కూడా ఉండటంతో ఈ గ్రహణంపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.హోలీ రోజే చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు ప్రత్యేకమైనది.  ఈ చంద్రగ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రగ్రహణంఎప్పుడు...హోలికాదహనానికి శుభ ముహూర్తం ఎప్పుడో ఈ స్టోరీలో తెలుసుకుందాం....!

20 26లో హోలీ రోజున చంద్రగ్రహణం జరగనుంది. ఈసారి హోలికా దహనం రోజున గ్రహణం కారణంగా పూజలు, దహనం చేసే సమయంలో స్వల్ప మార్పు ఉంటుంది. మత విశ్వాసాలలో, హోలీని చెడుపై మంచి విజయానికి చిహ్నంగా పరిగణిస్తారు. రంగుల పండుగ ప్రజల జీవితాల్లో కొత్త శక్తి మరియు ఆనందాన్ని తెస్తుందని నమ్ముతారు. 

 హోలీ పండుగ.. చంద్రగ్రహణం ఒకే రోజు కావడంతో.. హోలికా దహనం.. పూజల  విషయంలో కొన్ని మార్పులు ఉంటాయని పండితులు చెబుతున్నారు.  హోలీని చెడుపై మంచి విజయానికి చిహ్నంగా పరిగణిస్తారు. రంగుల పండుగ ప్రజల జీవితాల్లో కొత్త శక్తి ..ఆనందాన్ని తెస్తుంది. హోలీ రోజే  గ్రహణం కారణంగా  ఆ రోజు ( మార్చి 3) ప్రత్యేకమైనది. 

చంద్రగ్రహణం  సమయం  మరియు తేది

  • చంద్రగ్రహణం తేది: 2026 మార్చి 3
  • గ్రహణం ప్రారంభ సమయం: మధ్యాహ్నం 3.20 గంటలకు
  • గ్రహణం ముగింపు సమయం : సాయంత్రం 6.47 గంటలకు 
  • భారతదేశంలో కనిపించే సమయం: సాయంత్రం 6.20 గంటల నుంచి 27 నిమిషాలు
  • గ్రహణం పూర్తి సమయం : 3 గంటల 27 నిమిషాలు
  • మోక్షకాలం : 6.48 గంటలకు.

హోలికా దహనం, హోలీ తేదీ

హోలి పండుగ ఫాల్గుణ మాసం పూర్ణిమ రోజు వస్తుంది.  ఈ ఏడాది ( 2026) ఫాల్గుణ మాసం పూర్ణిమ తిథి మార్చి 2న సాయంత్రం 05:55 గంటలకు ప్రారంభమై, మార్చి 3న సాయంత్రం 05:07 గంటలకు ముగుస్తుంది. హోలీ జరుపుకునే తేదీని నిర్ణయించడంలో పౌర్ణమి తిథి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హోలికా దహన్ 2026 మార్చి 3న, మంగళవారం జరుగుతుంది. 

ఫాల్గుణ మాసం పూర్ణిమ తిథి వివరాలు

  • పూర్ణిమ తిథి ప్రారంభం : మార్చి 02, 2026న సాయంత్రం 05:55 గంటలకు
  • పూర్ణిమ తిథి ముగింపు: మార్చి 03, 2026న సాయంత్రం 05:07 గంటలకు

హెూలికా దహనానాకి శుభ ముహూర్తం 

  •  మార్చి2 సాయంత్రం 06:22 గంటల నుంచి రాత్రి 08:50 గంటల వరకు 
  • భద్ర కాలం :  మార్చి 3 ఉదయం 01:25 నుంచి గంటల వరకు  04:30 వరకు
  •  ప్రదోష కాలంలో, పూర్ణిమ తిథి ప్రకారం మార్చి2 సాయంత్రం హోలికా దహన్ 
  • భధ్రకాలానికి ముందుగా హోలికాదహన్ని జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. 
  • హోలీ పండుగ ( రంగుల పండుగ జరుపుకోవాల్సినతేది: మార్చి 4

 జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం  చంద్రగ్రహణం ముగిసిన తరువాతే  హోలికా దహనం  జరుపుకోవాలని చెబుతున్నారు.  మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా  హెలికా దహన పూజ జరుపుకోకూడదని పండితులు చెబుతున్నారు.   మార్చి 2 పౌర్ణమి ఘడియల్లో  భద్రకాలానికి ముందుగా  హోలికాదహనాన్ని చేసి.. మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా.. మార్చి 4 వ వతేదీన రంగుల పండుగ జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.