ఆపిల్ కొత్త ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ Air మోడల్స్‌ను గత ఏడాది గ్రాండ్‌గా లాంచ్ చేసిన సంగతి మీకు తెలిసిందే. అయితే కొత్త ఐఫోన్ కొనాలనుకునే వారికి లేదా పాత ఐఫోన్ నుండి అప్ గ్రేడ్ అవ్వాలి అనుకునేవారి కోసం ఆపిల్ వెబ్‌సైట్‌లో ఒక అదిరిపోయే ఆఫర్ ఉంది. నిజానికి ఐఫోన్ 17 256GB మోడల్ అసలు ధర రూ. 82,900, ఐఫోన్ 17 ప్రో ధర రూ. 1,34,900, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,49,900
రూ. 47,900కే ఐఫోన్ 17 ఎలా:
ఆపిల్ రెండు ఆఫర్ల ద్వారా మీరు సగం ధరకే కొత్త ఐఫోన్ 17ని సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మీ దగ్గర పాత ఐఫోన్ 16 ఉండి, మంచి కండిషన్‌లో ఉంటే.. ఆపిల్ దానికి రూ. 34 వేల వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ ఇస్తోంది. దింతో ఫోన్ ధర రూ. 48,900కి అవుతుంది. ఇంకా బ్యాంక్ డిస్కౌంట్ కింద కొన్ని సెలెక్ట్ చేసిన క్రెడిట్ కార్డులపై రూ. 1,000 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. చివరికి ఈ రెండు ఆఫర్లు కలిపితే, మీరు కొత్త ఐఫోన్ 17ను కేవలం రూ. 47,900కే సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 17 ఫీచర్స్ :
పాత మోడల్స్‌తో పోలిస్తే ఐఫోన్ 17లో అదిరిపోయే మార్పులు చేశారు. ఇందులో 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లే ఉంది. దీనివల్ల స్క్రీన్ టచ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. సినిమాలు చూసినా, గేమ్స్ ఆడినా చాలా క్వాలిటీగా కనిపిస్తుంది. ఇందులో కొత్త A19 చిప్‌సెట్ వాడారు. దీనివల్ల ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు, పైగా బ్యాటరీ కూడా ఎక్కువ కాలం పాటు లైఫ్ ఇస్తుంది.
►ALSO READ | రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇక మరింత భారీగా..! ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంపుతో మారనున్న లెక్కలు
సెల్ఫీ కెమెరా చుస్తే ముందు వైపు 18 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఇందులో 'సెంటర్ స్టేజ్' అనే ఫీచర్ ఉంది, దీనివల్ల వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు మీరు కదులుతున్నా కెమెరా మిమ్మల్ని ఫోకస్ చేస్తూ సెంటర్ లోనే ఉంచుతుంది.
బ్యాక్ వెనుక కెమెరా చూస్తే వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. మెయిన్ కెమెరా 48MP, అల్ట్రావైడ్ కెమెరా కూడా 48MP. తక్కువ వెలుతురులో కూడా ఫోటోలు చాలా స్పష్టంగా వస్తాయి. ఈ ఫోన్ 40W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఇంతకుముందు కంటే చాలా వేగంగా ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది.
