మాస్ లుక్‌‌‌‌లో ఘట్టమనేని వారసుడు

మాస్ లుక్‌‌‌‌లో ఘట్టమనేని వారసుడు

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కొడుకు జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తూ ‘ఆర్ఎక్స్‌‌‌‌ 100’ ఫేమ్ అజయ్ భూపతి రూపొందిస్తున్న చిత్రం  ‘శ్రీనివాస మంగాపురం’. అశ్వినీ దత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌‌‌‌పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. శనివారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో జయ కృష్ణ దుమ్ము ధూళి ఎగసే రగ్గడ్ బ్యాక్ డ్రాప్‌‌‌‌లో  హై స్పీడ్‌‌‌‌లో బైక్ నడుపుతూ మాస్ లుక్‌‌‌‌లో  కనిపిస్తున్నాడు.  

ఒక చేత్తో బైక్‌‌‌‌ను గట్టిగా పట్టుకుని, మరో చేత్తో గన్  టార్గెట్‌‌‌‌గా పెట్టిన విధానం ఇంటెన్స్‌‌‌‌గా ఉంది. యాక్షన్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో రాబోతున్న లవ్‌‌‌‌ స్టోరీ ఇదని మేకర్స్ తెలియజేశారు.  రవీనా టాండన్‌‌‌‌ కూతురు రాషా తడాని ఈ చిత్రంతో హీరోయిన్‌‌‌‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. జీ.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.