రామప్ప ఉప ఆలయాలకు జాతీయ ప్రాముఖ్యత

రామప్ప ఉప ఆలయాలకు జాతీయ ప్రాముఖ్యత

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు :ములుగు జిల్లాలో రామప్ప టెంపుల్ ఉప ఆలయాలైన గొల్లల గుడి, శివతారకేశ్వర స్వామి ఆలయాలకు జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నాలుగా భారత పురావస్తు సర్వేక్షణా సంస్కృతి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం గెజిట్ ను జారీ చేసినట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ నిహిల్ దాస్ తెలిపారు.

రామప్ప టెంపుల్ కు సమీపంలోని రెండు ఉప ఆలయాలను ఇప్పటికే  మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ఈ విషయంలో అభ్యంతరాలు ఉంటే రెండు నెలల లోపు కేంద్రపురావస్తు శాఖకు తెలపాలని సూచించారు.