వెలుగు, నెట్వర్క్: యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులు అన్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన– ప్రగతి నివేదన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ఆఫీసర్స్అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జనగామ జిల్లా కేంద్రంలో ఈగల్ ఫోర్స్ ఎస్పీ సీతారామ్ఆధ్వర్యంలో అవగాహన కల్పించగా, అంతకుముందు విద్యార్థులతో కలిసి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు.
హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రం, వంగపహాడ్ ప్రభుత్వ పాఠశాలలో ఈగల్ ఫోర్స్ డీఎస్పీ నర్సింహారావు డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు. ఎల్కతుర్తి పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్మెల్ స్కూల్లో ఈగల్ టీం డీఎస్పీ పుష్పక్ కుమార్ ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డితో కలిసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్, గట్లనర్సింగాపూర్‌లో ఇన్స్పెక్టర్ రాము మాట్లాడుతూ విద్యార్థులకు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
వరంగల్ జిల్లా పర్వతగిరిలో ఈగల్టీం డీఎస్పీ శంకర్ఆధ్వర్యంలో స్టూడెంట్లతో కలిసి ర్యాలీ నిర్వహించగా, చింతనెక్కొండలో పర్వతగిరి సీఐ రాజగోపాల్ పాల్గొని మాట్లాడారు. గీసుగొండ మండలం ధర్మారం స్కూల్లో ఈగల్ టీం డీఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. సంగెం మండలం ఆశాలపల్లిలో ఎస్సై వంశీకృష్ణ మాట్లాడారు. నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో విద్యార్థులు, లీడర్లతో కలిసి ఈగల్ ఫోర్స్ డీఎస్పీ భిక్షపతిరావు ర్యాలీలు నిర్వహించారు.
