భారత కల్చరల్ అకాడమీ, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో నటప్రపూర్ణ కత్తి కాంతారావు స్మారక జాతీయ పురస్కారాన్ని నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్‌కు అందజేశారు. ఈ ప్రదానోత్సవ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు, దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, సీనియర్ నటి కవిత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఎండీ, ఐ అండ్ పీఆర్ కమిషనర్ శ్రీమతి ప్రియాంక, రచయిత మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘జానపద చిత్రాల్లో కాంతారావు గారికి సాటి ఎవరూ లేరు. తమిళంలో ఎంజీఆర్ లాంటి సీనియర్ హీరోనే ఆయన నటన చూసి హడలెత్తిపోయేవారు. అలాంటి గొప్ప నటుడి అవార్డ్ నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని అన్నారు.
