Virat Kohli: తొలి వన్డేలోనే కోహ్లీ కొట్టేస్తాడా.. ప్రమాదంలో సచిన్, సంగక్కర, పాంటింగ్ హిస్టారికల్ రికార్డ్స్

Virat Kohli: తొలి వన్డేలోనే కోహ్లీ కొట్టేస్తాడా.. ప్రమాదంలో సచిన్, సంగక్కర, పాంటింగ్ హిస్టారికల్ రికార్డ్స్

టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ సిరీస్ లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. న్యూజిలాండ్ తో టీమిండియా ఆదివారం (జనవరి 11) తొలి వన్డే ఆడనుంది. వడోదర వేదికగా BCA స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తోంది. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఆటను చూడడానికి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. టెస్ట్, టీ20 ఫార్మాట్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్.. ప్రస్తుతం వన్డేల్లో అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. ఇదే ఊపులో కొన్ని చారిత్రాత్మక రికార్డ్స్ పై కింగ్ కన్నేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రికార్డ్స్ బ్రేక్ చేసేందుకు కోహ్లీ సిద్ధమయ్యాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. 

28000 పరుగులకు 25 పరుగులు దూరంలో:

అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ మూడు ఫార్మాట్ లలో ఇప్పటివరకు 623 ఇన్నింగ్స్ ల్లో 27975 పరుగులు చేశాడు. కోహ్లీ మరో 25 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 28 వేల పరుగులు చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టిస్తాడు. అంతేకాదు 28 వేల పరుగుల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మూడో ప్లేయర్ గా నిలుస్తాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటివరకు సచిన్, సంగక్కర మాత్రమే 28 వేల పరుగులు చేశారు. ఈ కివీస్ తో జరగబోయే మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో కోహ్లీ 28వేల క్లబ్ లో చేరడం ఖాయంగా మారింది. అయితే తొలి మ్యాచ్ లోనే ఈ రికార్డ్ కు చేరుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

28 వేల పరుగులు చేయడానికి సచిన్ కు 644 ఇన్నింగ్స్ లు అవసరమైతే.. సంగక్కరకు 666 ఇన్నింగ్స్ లు తీసుకున్నాడు. కోహ్లీ 623 ఇన్నింగ్స్ ల్లోనే 27975 పరుగులు చేసి వీరిద్దరి కంటే ఫాస్టెస్ట్ గా ఈ క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. తొలి వన్డేలో 42 పరుగులు చేస్తే స్రులంక దిగ్గజం సంగక్కరను వెనక్కి నెట్టి అంతర్జాతీయ క్రికెట్ లో మూడు ఫార్మాట్ లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్ గా నిలుస్తాడు. సంగక్కర మూడు ఫార్మాట్ లలో 28016 పరుగులు చేస్తే .. కోహ్లీ ఖాతాలో 27975 పరుగులు ఉన్నాయి. 34357 పరుగులతో తొలి స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. 

2. న్యూజిలాండ్‌పై అత్యధిక వన్డే సెంచరీలు:

విరాట్ కోహ్లీ ఇప్పటివరకు న్యూజిలాండ్‌పై ఆరు వన్డే సెంచరీలు చేశాడు. న్యూజిలాండ్ పై అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ గా  వీరేంద్ర సెహ్వాగ్, రికీ పాంటింగ్‌లతో సమంగా ఉన్నాడు. తొలి వన్డేలో సెంచరీ కొడితే ఈ ఇద్దరినీ వెనక్కి నెట్టి కోహ్లీ అగ్రస్థానానికి చేరుతాడు. తొలి వన్డేలో కొట్టకపోయిన కోహ్లీ ఫామ్ ను చూస్తే మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో కోహ్లీ సెంచరీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

3. న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు:
 
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన అన్ని వన్డే మ్యాచుల్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసింది సచిన్ టెండూల్కర్. న్యూజిలాండ్ పై 41 ఇన్నింగ్స్ లు ఆడిన సచిన్.. 46.05 సగటుతో 1750 పరుగులు చేశాడు సచిన్. ఇప్పటి వరకు ఇదే హయ్యస్ట్. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో కోహ్లీ ఉన్నాడు. ఇప్పటి వరకు న్యూజిలాండ్ పై 33 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ.. 55.23 సగటుతో.. 1657 పరుగులు చేశాడు. మరో 94 పరుగులు చేస్తే.. సచిన్ పేరుతో ఉన్న హయ్యస్ట్ రికార్డ్ బ్రేక్ అవుతుంది. మరి ఈ మూడు రికార్డ్స్ కోహ్లీ తొలి వన్డేలో బ్రేక్ చేస్తాడా లేకపోతే సిరీస్ లో బ్రేక్ చేస్తాడో చూడాలి.