T20 World Cup: టీ20 ప్రపంచ కప్ మొత్తం అదరగొట్టి.. చివర్లో దక్షణాఫ్రికా తడబడి.. భారీ మూల్యం చెల్లించుకుంది. సూపర్– 8లో భారత్, వెస్టిండీస్, జింబాబ్వేపై భారీ తేడాతో విజయం సాధించిన.. ప్రోటీస్ జట్టని న్యూజిలాండ్ చిత్తు చిత్తుగా ఓడించింది. ఓపెనర్ ఫిన్ అలెన్(100 నాటౌట్) బౌండరీల సునామీలో సఫారీ టీమ్ కొట్టుకుపోయింది. 170 పరుగుల లక్ష్య ఛేదనలో అలెన్ చిరస్మరణీయ శతకంతో చెలరేగాడు.. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. జస్ట్ 33 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో శతకం చేశాడు.
టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి దక్షిణాఫ్రికాపై విజయంతో కివీస్ చరిత్ర లిఖించింది. విన్నింగ్ షాట్‌తో అలెన్ సెంచరీ పూర్తి చేసుకోగా 9 వికెట్ల గెలుపుతో రెండోసారి బ్లాక్‌క్యాప్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఐసీసీ వరల్డ్ కప్ గెలవాలన్న కలను మరోసారి నెరవేర్చుకోకుండానే, టీ20 ప్రపంచకప్ 2026 నుంచి దక్షిణాఫ్రికా నిష్క్రమించింది. ఇవాళ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు దారుణంగా విఫలమైన, చివర్లో మార్కో జాన్సెన్ హాఫ్ సెంచరీతో చెలరేగగా, డెవాల్డ్ బ్రెవిస్ (34), ట్రిస్టన్ స్టబ్స్ (29) సైతం కాసేపు బ్యాట్ ఝలిపించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
సౌతాఫ్రికా బ్యాటర్లలో క్వింటన్ డి కాక్ (10 ), ఐడెన్ మార్క్రామ్ (18), ర్యాన్ రికెల్టన్ ( 0), డేవిడ్ మిల్లర్ ( 6), కోర్బిన్ బాష్ ( )2, కాగిసో రబడ ( 0) విఫలం కావడంతో పాటు అటు బౌలర్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మార్కో జాన్సెన్ 2. 5 ఓవర్లలోనే 53 ఇవ్వగా, కోర్బిన్ బాష్ 35 రన్స్, కేవశ్ మహారాజ్ 33 పరుగులు, కగిసో రబడా 28 రన్స్, లుంగి ఎంగిడి 22 పరుగులు ఇచ్చారు. సెమీఫైనల్ కి ముందు అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనఫ్ తో దూకుడు ప్రదర్శించిన ప్రోటీస్ జట్టు మరోసారి టైటిల్ పోరుకు ముందు ఇలా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
WHAT. AN. INNINGS. 🙌
— Star Sports (@StarSportsIndia) March 4, 2026
Finn Allen smashed the fastest-ever hundred in the ICC Men’s T20 World Cup, off just 33 deliveries, to guide New Zealand to the final! 🖤#T20WorldCup #SAvNZ pic.twitter.com/HI1THR9wBR
