నిజామాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలో వర్ని మండలంలోని పలు గ్రామాల్లో సంచరిస్తున్న పులి స్థానికులకు కంటి మీదకునుకు లేకుండా చేస్తోంది. బుధవారం కూనిపూర్ శివారులో మేకల మందపై దాడి చేసి రెండు మేకలను చంపేసింది. వివరాల్లోకివెళితే..
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కూనిపూర్ గ్రామ శివారులో బుధవారం (మార్చి4) మేకలమందలపై పులి దాడి చేసింది. ఈ దాడిలో రెండు మేకలు అక్కడిక్కడే చనిపోయాయి. ఒక్కసారిగా మేకలమందపై పులి దాడి చేయడంతో మేకల కాపరులు భయంతో పరుగులు పెట్టారు.
స్థానికుల సమాచారంలో కూనిపూర్ కు చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పులి ఆనవాళ్లను పరిశీలించారు. కూనిపూర్, దాని సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా బావుల దగ్గర కు వెళ్లే రైతులు, గొర్లుమేకలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
