ఆల్మంట్-కిడ్ సిరప్ వాడకం నిలిపివేయాలని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) ఆదేశించింది. ఈ సిరప్ లో ఇథిలీన్ గ్లైకాల్ కలుషితమై ఉన్నట్లు గుర్తించిన బోర్డు.. ఈ మేరకు హెచ్చరిక నోటీసు జారీ చేసింది. ఇది విషపూరితమయ్యే ప్రమాదం ఉందని.. చాలా ప్రమాదకరంగా మారుతుందని డ్రగ్ కంట్రోల్ అధికారులు శనివారం (జనవరి 10) తెలిపారు.
ఆల్మంట్ కిడ్ సిరప్ విషపూరితమయ్యే ప్రమాదం ఉందని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ((CDSCO), ఈస్ట్ జోన్ కోల్ కతా నుంచి అందిన హెచ్చరికల మేరకు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సిరప్ లో ఉండే లివోసిట్రజైన్ డైహైడ్రోక్లోరైడ్ అండ్ మాంటెలుకస్ట్ సోడియం సిరప్ కలుషితం అయినట్లు DCA కు హెచ్చరిలు పంపింది CDSCO.
ఈ సిరప్ ఎవరైనా వాడుతున్నా, ప్రిస్క్రిప్షన్ లో ఉన్న వాడకూడదని డ్రగ్ కంట్రోల్ అధికారులు హెచ్చరించారు. ఈ సిరప్ విక్రయాలు వెంటనే నిలిపివేయాలని సూంచించారు. పిల్లలకు వాడే సిరప్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బ్యాచ్ నెం.AL-24002 కు చెందిన ఈ సిరప్ బీహార్ కు చెందిన ట్రైడస్ రెమెడీస్ అనే సంస్థ తయారు చేసింది.
డ్రగ్ పూర్తి వివరాలు:
పేరు: ఆల్మంట్-కిడ్ సిరప్ (లివోసిట్రజైన్ డైహైడ్రోక్లోరైడ్ అండ్ మాంటెలుకస్ట్ సోడియం సిరప్)
బ్యాచ్ నంబర్: AL-24002
తయారీ తేదీ: జనవరి 2025
గడువు తేదీ: డిసెంబర్ 2026
తయారీదారు: ట్రైడస్ రెమెడీస్,
ప్లాట్ నెం. D-42, D-43, ఫేజ్-II, ఇండస్ట్రియల్ ఏరియా,
హాజీపూర్, వైశాలి - 844102, బీహార్
