జడ్జి స్థానంలో ఉన్న స్పీకర్ నే ప్రశ్నిస్తారా.? కేటీఆర్ కు పొంగులేటి కౌంటర్

జడ్జి స్థానంలో ఉన్న స్పీకర్ నే  ప్రశ్నిస్తారా.? కేటీఆర్ కు  పొంగులేటి కౌంటర్

పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగింది. ఎమ్మెల్యే  దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై   స్పీకర్ తీర్పును కేటీఆర్ ప్రస్తావించారు.  బీఆర్ఎస్ పార్టీ నుంచి  గెలిచిన ఎమ్మెల్యే దానం కాంగ్రెస్ బీ ఫామ్ పై ఎంపీగా పోటీ చేశారని అన్నారు. దానం పార్టీ మారినట్లు ఆధారలు లేవని స్పీకర్ తీర్పు చెప్పడాన్ని తప్పుబట్టారు.

  అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన స్పీకర్.. కేటీఆర్ జడ్జిమెంట్ మొత్తం చదవకుండా మాట్లాడుతున్నారని అసహనం  వ్యక్తం చేశారు. తనపై  విమర్శలు చేసిన ప్రతీ సారి మీడియా ముందుకు వచ్చి సమాదానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఉన్నత పదవిలో ఉన్న తనను అవమానించడం కరెక్ట్ కాదన్నారు. పార్టీ ఫిరాయింపులపై జడ్జి మెంట్ కాపీ పూర్తిగా చదివి మాట్లాడాలని కేటీఆర్ కు సూచించారు. 

అనంతరం మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.  కేటీఆర్  అహంకారంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. జడ్జి స్థానంలో ఉన్న స్పీకర్ నే ప్రశ్నించడం కరెక్ట్ కాదన్నారు.  బీఆర్ఎస్ నిజాయితీగా ఉంటే ఎందుకు ఎన్నికల్లో ఓడిపోతుందని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నపుడు ఒకలా..ప్రతిపక్షంలో ఉన్నపుడు మరో విధంగా మాట్లాడటం కేటీఆర్ కే చెల్లుతుందన్నారు. 

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా  కౌంటర్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ ఫిరాయింపుల గురించి మీ నాన్నను అడగాలంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  తెలంగాణలో కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసిన విధానాన్ని అడిగి తెలుసుకోవాలని సూచించారు.

ALSO READ : బిడ్డను దత్తత తీసుకున్న ప్రతి తల్లికి ప్రసూతి సెలవులివ్వాల్సిందే..