మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల షెడ్యూల్ విడుదల

మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల షెడ్యూల్ విడుదల

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా శనివారం మధ్యాహ్నం ప్రకటించారు. నేటి నుంచే రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందన్నారు. అక్టోబరు 21న రెండు రాష్ట్రాల్లో ఓటింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 27న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఆ రోజు నుంచి అక్టోబరు 4 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని అన్నారు. అక్టోబరు 21న పోలింగ్ నిర్వహించి, 24వ తేదీన కౌంటింగ్ చేపడతామని ప్రకటించారు.

రెండు రాష్ట్రాల్లోనే ఒకే విడతలో ఎన్నికలు పెడతామని సునీల్ అరోరా చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన గచ్చిరోలి, గోండియాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ ఎన్నికలను పర్యావరణ హితంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ప్రచారంలో రాజకీయ పార్టీలేవీ ప్లాస్టిక్ ను వాడొద్దని కోరుతున్నామన్నారు.

నవంబరు 2న హర్యానా అసెంబ్లీ, నవంబరు 9న మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తాయి.

మహారాష్ట్ర: 288 సీట్లు, 8.94 కోట్ల ఓటర్లు

హర్యానా: 90 సీట్లు, 1.82 కోట్ల ఓటర్లు