శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణం

శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణం

ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణం బ‌య‌ట ప‌డింది. దేవ‌స్థానంలో ప‌నిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు రూ. 3.30కోట్ల మేర నిధులు స్వాహా చేసినట్టు స‌మాచారం. శ్రీఘ్రదర్శనం, అభిషేకం, మంగళహారతి టికెట్లలో గోల్ మాల్ జ‌రిగింది. దేవస్థానం గదుల బుకింగ్ లో కాంట్రాక్టు ఉద్యోగులు సాఫ్ట్‌వేర్ మార్చి అక్రమాలకు పాల్పడినట్లు నిర్దారణ అయింది. వారి అవినీతి బయటపడటంతో ఒకరిపై ఒకరు ఆల‌య ఈవోకు పరస్పరం ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆలయ ఈవో కె.ఎస్.రామారావు మాట్లాడుతూ.. అక్ర‌మాలు జ‌రిగిన‌ది వాస్తవమేన‌ని, అయితే
మొత్తం ఎంత జరిగింది అనేదానిపై ఇంకా పూర్తి నివేదిక రాలేద‌ని చెప్పారు. దేవ‌స్థానంలో జ‌రిగిన అవినీతిపై ప్రభుత్వానికి కూడా నివేదిక పంపుతామ‌ని తెలిపారు.