
ప్రస్తుతం ప్రముఖ తెలుగు ప్లాట్ఫామ్ ఆహా ఓటీటీలో సక్సెస్ ఫుల్గా మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న సర్కార్ షో కి..సుడీగాలి సుధీర్ యాంకరింగ్ చేస్తున్నాడు. అయితే లేటెస్ట్గా సర్కార్ సీజన్ 4కి సంబంధించిన మూడో ఎపిసోడ్ మే 3న రిలీజ్ అయ్యి దూసుకెళ్తోంది.
ఈ షోలో నలుగురు టాలీవుడ్ లేటెస్ట్ హీరోయిన్లు సందడి చేసి అలరించారు. ఇందులో మల్లేశం ఫేమ్ అనన్య నాగళ్ల, మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరిప్రియ, బబుల్ గమ్ బ్యూటీ మానస చౌదరి, శివాని గెస్ట్‌లుగా వచ్చారు. అయితే, ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ షోకి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
ప్రస్తుతం ఆహా ఓటీటీలో సర్కార్ షోనే టాప్ ట్రెండింగ్ లో ఉంది. మొత్తంగా ఈ ఓటీటీలోని టాప్ 10 ట్రెండింగ్స్ లో ఉండగా..అందులో మూడు షోలు కాగా..మిగిలిన ఏడు సినిమాలు కావడం విశేషం. అయితే సుధీర్ హోస్ట్ చేస్తున్న ఈ సర్కార్ షో ఆహ ఓటీటీలో దూసుకెళ్తోంది. నెక్స్ట్ రాబోయే ఐదో ఎపిసోడ్ కి చందమామగా పిలవబడే టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఈ షోకి రాబోతుంది. ఈ వారం ఎపిసోడ్ కూడా పక్కా హిట్ బొమ్మ పడడం కన్ఫమ్. ఈ సర్కార్ సెలబ్రిటీ షో నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఓ కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది.
సుడీగాలి సుధీర్ బుల్లితెరపై అతని ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.జబర్దస్త్ షోల్ కమోడియన్ గా.. టీవీ షోల్లో యాంకర్గా ..అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తున్నాడు. చిన్నా చితక మెజిషియన్ చేసుకుంటూ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి ఇమేజ్ పెంచుకున్నాడు. పలు షోలతో బిజీగా గడుపుతునే..వీలైనప్పుడు సినిమాలు కూడా చేస్తున్నాడు.
ఇక సుధీర్ సర్కార్ షో తర్వాత రెండో స్థానంలో అభినవ్ గోమటం నటించిన మై డియర్ దొంగ ఉండగా..ఇక మూడో స్థానంలో మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమలు మూవీ ఉంది.