కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది. 2023, నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే.. నవంబర్ 17వ తేదీ శుక్రారం  పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో నిర్వహించిన మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న ఖర్గే.. 'అభయ హస్తం' పేరుతో 42 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు.  ఇప్పటికే ఆరు గ్యారంటీలు, బీసీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్ లను కాంగ్రెస్ విడుదల చేసిన విషయం తెలిసిందే.