మెడికల్ షాపులో మీ వివరాలు చెబితేనే జ్వరం,జలుబు మందులు

మెడికల్ షాపులో మీ వివరాలు చెబితేనే జ్వరం,జలుబు మందులు

మెడికల్ షాపులో మెడిసిన్ కొనాలంటే డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ తప్పనిసరి. కానీ చిన్నచిన్న సమస్యలకు షాపు నిర్వాహకులు ఈ నిబంధన పట్టించుకోరు. సమస్య చెప్పగానే వారికి తెలిసిన మెడిసిన్ ను ఇస్తారు. ఇకపై ఇలా ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తిస్తుండగంతో దగ్గు, జ్వరం, జలుబుకు మందు కొనాలంటే ఇకపై  మెడికల్ షాపుల్లో తప్పనిసరిగా మీ ఫోన్‌ నంబరు, అడ్రస్‌ ఇవ్వాల్సిందే.  దీనికి సంబంధించి మున్సిపల్‌ శాఖ ఆదేశాలుజారీ చేసింది.

కరోనా లక్షణాల్లో జ్వరం, దగ్గు ముఖ్యమైనవి. ఈ లక్షణాలు ఉన్నవారు డాక్టర్‌ చీటీ లేకుండా నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి మెడిసిన్ కొనుగోలు చేస్తున్నారు. ఇకపై ఇలా కొన్నవారి వివరాలను షాపు నిర్వాహకులు తీసుకోవాలి. అయితే మందులు కొన్నవారి మంచి కోసమే చేస్తున్నట్టు వారిని ఒప్పించి అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌ తీసుకోవాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ తెలిపారు.